‘కుడా’కు 30 ఎకరాల భూమి అప్పగింత | - | Sakshi
Sakshi News home page

‘కుడా’కు 30 ఎకరాల భూమి అప్పగింత

Jul 8 2026 12:56 AM | Updated on Jul 8 2026 12:56 AM

‘కుడా’కు 30 ఎకరాల భూమి అప్పగింత

నయీంనగర్‌: కుడా ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం ప్రక్రియలో భాగంగా హనుమకొండ వడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్‌ పరిసర ప్రాంతాల్లోని భూములను అభివృద్ధి చేసేందుకు యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. మంగళవారం భూయజమానుల కమిటీ సభ్యులు బూర విద్యాసాగర్‌, ఎం.విజయ్‌కుమార్‌, డి.స్వరాజ్యలక్ష్మి బి.అశోక్‌కుమార్‌, బి.వెంకటయ్య, తిరుపతిరెడ్డి కుడా కార్యాలయంలో చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి, సీపీఓ అజిత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. 30 ఎకరాల భూమిని ఎల్‌పీఎస్‌ నిబంధనల ప్రకారం కుడా ఆధ్వర్యంలో లేఔట్‌ చేయడానికి అంగీకారం తెలిపారు. ఇందుకు సంబంధించిన అధికారిక దరఖాస్తులు, భూమి హక్కు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా కుడా చైర్మన్‌ మాట్లాడుతూ నగర సుందరీకరణ, క్రమబద్ధమైన పట్టణాభివృద్ధికి ల్యాండ్‌ పూలింగ్‌ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా చేయడానికి రానున్న నాలుగు రోజుల్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement