న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణికి 211 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. అందులో రెవెన్యూకు సంబంధించినవి 67, మున్సిపల్ శాఖ 55, హౌసింగ్ 29, ఇతర శాఖలకు సంబంధించినవి 60 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఈ మేరకు దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు పంపిణీ చేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్వో విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
గ్రీవెన్స్‌కు 211 ఫిర్యాదులు


