వరంగల్‌ | - | Sakshi
Sakshi News home page

వరంగల్‌

Jul 7 2026 1:49 AM | Updated on Jul 7 2026 1:49 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2026
బాలల సంరక్షణపై

పురాతన సంపదగా పాలంపేట శివాలయం

ములుగు జిల్లాలోని రామప్ప ఉప ఆలయం శివ తారకేశ్వరస్వామి దేవాలయాన్ని కేంద్ర ప్రభుత్వం స్మారక చిహ్నంగా గుర్తించింది.

సాక్షి, వరంగల్‌: బాలల సంరక్షణలో కీలకంగా వ్యవహరించే వరంగల్‌ డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (డీసీపీయూ) ఖాళీగా దర్శనిమిస్తోంది. ఇన్‌చార్జ్‌ డీసీపీఓ కాకుండా మిగతా 12 మందిలో ఒక అవుట్‌ రీచ్‌ వర్కర్‌, డేటా అనాలసిస్ట్‌ మినహా పది పోస్టులు ఖాళీగా ఉండడంతో పిల్లల రక్షణకు సంబంధించిన కేసుల పరిశీలన, పునరావాస చర్యలు, బాల్య వివాహాల నియంత్రణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, చైల్డ్‌ కేర్‌ సంస్థల పర్యవేక్షణ, దత్తత ప్రక్రియ, వివిధ శాఖలతో సమన్వయం వంటి కార్యక్రమాల్లో జాప్యం ఏర్పడుతోంది. అలాగే ప్రమాదంలో ఉన్న చిన్నారులను గుర్తించడం, కౌన్సెలింగ్‌, ఫాలోఅప్‌ చర్యలు, ఫీల్డ్‌ విజిట్‌ వంటి సేవలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా తప్పిపోయిన, పారిపోయిన పిల్లలు, బాల కార్మికులను గుర్తించే ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. పోక్సో కేసుల్లో బాధితులకు నష్ట పరిహారం అందించాల్సిన ఫైళ్లు కూడా ఎక్కడికక్కడా పెండింగ్‌లో ఉంటుండడంపై విమర్శలొస్తున్నాయి. ఈ విభాగాన్ని బలోపేతం చేయాల్సిన ఉన్నతాధికారులు ఏడాదికిపైగా ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను భర్తీ చేయకపోవడంతో బాలల సంరక్షణ వ్యవస్థ కుంటుపడుతోందన్న చర్చ జరుగుతోంది. కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద దృష్టి సారిస్తేనే డీసీపీయూ గాడిన పడే ఆస్కారముంది. ఇన్‌చార్జ్‌ డీపీసీఓ ఉమా మే 31న బదిలీ అయినప్పటి నుంచి అసలు ఈ బాలరక్షా భవన్‌ను పట్టించుకునే వారే లేకుండా పోయారు.

ఇన్‌చార్జ్‌ డీసీపీఓ బదిలీతో పర్యవేక్షణ కరువు

డీసీపీయూలోని 12 పోస్టుల్లో పది ఖాళీలే

ఆపరేషన్‌ ముస్కాన్‌కు తప్పనితిప్పలు

ఏడాదికిపైగా భర్తీకాని పోస్టులు

కలెక్టర్‌ దృష్టి సారిస్తేనే బాలలకు రక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement