ఎల్కతుర్తిని అభివృద్ధిలో ముందుంచుతాం | - | Sakshi
Sakshi News home page

ఎల్కతుర్తిని అభివృద్ధిలో ముందుంచుతాం

Jul 7 2026 1:49 AM | Updated on Jul 7 2026 1:49 AM

ఎల్కతుర్తిని అభివృద్ధిలో ముందుంచుతాం

ఎల్కతుర్తి: భవిష్యత్‌లో హనుమకొండ జిల్లా ఎల్క తుర్తి మండల కేంద్రాన్ని అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుపుతామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ స్పష్టం చేశారు. సోమవారం ఎల్కతుర్తి జంక్షన్‌ నుంచి మడిపల్లి వరకు కుడా ఆధ్వర్యంలో రూ.13 కోట్లతో 3.5 కిలోమీటర్ల పొడవునా చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌, కుడా చైర్మన్‌ ఇనుగాల వెంకట్రాంరెడ్డి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సుకినె సంతాజీతో కలిసి శిలాఫకాన్ని ఆవిష్కరించి పనులు ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రహదారి నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించాలని కోరారు. కుడా చైర్మన్‌ మాట్లాడుతూ.. వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ.. రహదారి నిర్మాణంతో కనెక్టివిటీ పెరిగి గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కుడా సీపీఓ అజిత్‌రెడ్డిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎల్కతుర్తి నుంచి దామెరకు వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి పొన్నం ప్రభాకర్‌ కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు.

మాజీ ఉప ప్రధానికి ఘన నివాళి

స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబూ జగ్జీవన్‌రామ్‌ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మునిగడుప లావణ్య, ఉపసర్పంచ్‌ రాజు, ఆర్డీఓ వెంకటేశ్‌, ఈఈ భీంరావు, పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు ముప్పు శ్రీనివాస్‌, ఇంద్రసేనారెడ్డి, రావుల రమేశ్‌, ముప్పు మహేందర్‌, శనిగరం వెంకటేశ్‌, శీలం అనీల్‌, హింగె శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్‌

రూ. 13 కోట్లతో చేపట్టే బీటీ రోడ్డు

నిర్మాణ పనులు ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement