భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
నల్లబెల్లి: నాగరాజుపల్లిలోని మద్దిమేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించాలని ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ మోహన్‌రావు విద్యుత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన జాతరను సందర్శించి వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం జాతరలో చేపడుతున్న విద్యుత్ లైన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో డీఈ హార్జినాయక్, ఏడీఈ జానకీరామ్, సర్పంచ్‌లు లలిత, సరోజ, రవి చిన్న, రాజు, ఆలయ కమిటీ చైర్మన్ చిట్యాల ఉపేందర్‌రెడ్డి, ఆలయ ప్రధాన పూజా రి దురిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఉర్సును వైభవంగా నిర్వహించాలి
పర్వతగిరి: అన్నారం షరీఫ్ ఉర్సును వైభవంగా నిర్వహించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఈ మేరకు హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉర్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉత్సవాల్లో భాగంగా జనవరి 5వ తేదీన గంధం, 6న దీపారాధన, 7న ఖత్‌మేఖురాన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ రియాజ్‌మహమ్మద్, అన్నారం గ్రామ సర్పంచ్ గాడిపల్లి మహేందర్, గ్రామ అధ్యక్షుడు గొడుగు రమేశ్, యూత్ అధ్యక్షుడు గొడుగు వినయ్, వార్డు సభ్యులు రాజబాబు, రామకృష్ణ, పవన్‌కల్యాణ్, రవి, మధు, రామ్మూర్తి, అఖిల్, భార్గవ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు అధికారులకు పతకాలు
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పతకాలను ప్రకటించింది. టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్, ట్రాన్స్‌కో విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌కు మహోన్నత సేవా పతకం, క్రైమ్ ఏసీపీ సదయ్య, ఏఎస్సై వేణుగోపాల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేశ్‌బాబుకు ఉత్తమ సేవా పతకం, ఎస్సై కనక చంద్రం, ఏస్సైలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, శ్యామ్ సుందర్‌రెడ్డి, స్వర్ణలత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈసందర్భంగా వారికి వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు.
సాగునీటి విడుదల
నర్సంపేట రూరల్: మండలంలోని మాదన్నపేట చెరువు పెద్ద కాల్వ నుంచి సాగునీటిని బుధవారం నీటిపారుదల శాఖ ఏఈ నితిన్, రైతులు విడుదల చేశారు. చెరువు కింద యాసంగి తైబందీ ఇటీవల 1,020 ఎకరాలకు ఖరారు చేశారు. వరి నార్లు, నాట్ల కోసం రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
మత్స్యకారుల వలలో
చిక్కిన కొండచిలువ
వర్ధన్నపేట: మండలంలోని కట్య్రాల గ్రామ ఊర చెరువులో మత్స్యకారులకు బుధవారం కొండచిలువ చిక్కింది. చేపల వేట కోసం మత్స్యకారులు చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో వల వేయగా కొండచిలువ చిక్కడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే గ్రామంలోని స్నేక్ క్యాచర్‌ను పిలిపించి కొండచిలువను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలారు. దీంతో వారు ఊపిరి పిల్చుకున్నారు.
మధుసూదన్ సదయ్య సుధాకర్
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి
భక్తులకు మెరుగైన సేవలు అందించాలి


