ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
హన్మకొండ చౌరస్తా: నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2025వ సంవత్సరం జిల్లావ్యాప్తంగా అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు కీలకంగా నిలిచిందని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంతోపాటు మౌలిక వసతుల కల్పనలో ముందున్నామని తెలిపారు. 2026 కొత్త సంవత్సరం ప్రతీ కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, అభివృద్ధి తీసుకురావాలని ఆకాంక్షించారు.
హనుమకొండ కలెక్టర్..
హన్మకొండ అర్బన్ : హనుమకొండ జిల్లా ప్రజలకు కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. జిల్లాను అభివృద్ధి పథంలో నిలిపేందుకు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తోడ్పాటు అందిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు నూతన సంవత్సరంలోనూ సహకరించాలని కోరారు.
మేయర్ శుభాకాంక్షలు
వరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగర ప్రజలకు మేయర్ గుండు సుధారాణి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని, ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు నిండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మేయర్ ఆకాంక్షించారు.
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) ఎన్.రవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రవి ఇంతకాలం భూపాలపల్లి డీఆర్ఓగా పని చేస్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు. కీసర, నల్లగొండ ప్రాంతాల్లో ఆర్డీఓగా పని చేశారు. హనుమకొండ రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇటీవల ఏసీబీకి పట్టుబడడంతో పోస్టు ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. భూపాలపల్లి డీఆర్ఓగా ఉన్న రవిని హనుమకొండకు బదిలీ చేయడంతో ఖాళీ అయిన ఆ స్థానాన్ని ప్రస్తుతం హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న పోరిక హరికృష్ణకు కేటాయించారు.
కాజీపేట అర్బన్ : మడికొండ పోలీస్‌స్టేషన్‌ను బుధవారం సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తనిఖీ చేశారు. పీఎస్‌లో మూడేళ్ల నేరాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై ఆరా తీశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, పోలీస్ ఇమేజ్ పెంచేందుకు కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ పి.కిషన్, ఎస్సైలు రాజబాబు, రాజ్‌కుమార్, రామ్మోహన్ పాల్గొన్నారు.
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పతకాలను ప్రకటించింది. టాస్క్‌ఫోర్స్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్, ట్రాన్స్‌కో విభాగంలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌కు మహోన్నత సేవా పతకం, క్రైమ్ ఏసీపీ సదయ్య, ఏఎస్సై వేణుగోపాల్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేశ్‌బాబుకు ఉత్తమ సేవా పతకం, ఎస్సై కనక చంద్రం, ఏస్సైలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, హెడ్ కానిస్టేబుళ్లు అమీర్ పాషా, నర్సింగరావు, శ్యామ్ సుందర్‌రెడ్డి, స్వర్ణలత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈసందర్భంగా వారికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు.
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు


