కొత్తకొండ ఆలయ హుండీ లెక్కింపు
● ఐదు నెలల ఆదాయం రూ.8,68,742
ఎల్కతుర్తి: భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో బుధవారం హుండీ లెక్కించారు. ఐదు నెలల హుండీ ఆదాయం రూ.8,68,742 వచ్చినట్లు ఆలయ ఈఓ కిషన్‌రావు తెలిపారు. ఆదాయాన్ని బ్యాంకులో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ హనుకొండ డివిజన్ పరిశీలకులు అనిల్, గ్రామ సర్పంచ్ సిద్ధమల్ల రమా రమేశ్, కార్యక్రమంలో అర్చకులు రాంబాబు, రవిశర్మ, రవీందర్, శ్రీధర్, రాజు, పాలకవర్గ సభ్యులు, రాజరాజేశ్వర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.


