యూరియా కోసం పడిగాపులు
నర్సంపేట రూరల్: గ్రామాల్లోని రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. సొసైటీ గోదాముల ఎదుట బారులుదీరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెన్నారావుపేట సొసైటీ గోదాంకు 444 యూరియా బస్తాలు, ఎల్లాయగూడెం గ్రామానికి 444 బస్తాలు, ఉప్పరపల్లి సొసైటీకి 444 బస్తాలు, ఖాదర్‌పేటకు 444 బస్తాల యూరియా వచ్చింది. విషయం తెలుసుకున్న రైతులు మంగళవారం అర్ధరాత్రి నుంచే చలిలో పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం వ్యవసాయ విస్తీర్ణాధికారులు టోకెన్లు అందించి యూరియా బస్తాలు పంపిణీ చేశారు. యూరియా దొరకని రైతులు నిరాశతో వెనుదిరిగారు.


