సరిపడా యూరియా ఉంది
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ
నెక్కొండ: సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతులకు యూరియా అందిస్తామని, సీజన్‌కు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి అనురాధ అన్నారు. మండల కేంద్రంలోని మండల వ్యవసాయశాఖ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం 87,508 ఎకరాలు కాగా, అందుకు సరిపడా యూరియా అక్టోబర్‌లో 3,776 మెట్రిక్ టన్నులు, నవంబర్‌లో 2,769 మెట్రిక్ టన్నులు, డిసెంబర్‌లో 438 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేసినట్లు వివరించారు. ఇంకా 5,400 మెట్రిక్ టన్నుల యూరియా మార్క్‌ఫెడ్‌లో అందుబాటులో ఉందన్నారు. ఈనెల 26న జిల్లాలోని అన్ని పీఏసీఎస్ కేంద్రాలకు 720 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు చెప్పారు. యాసంగి సీజన్‌లో రైతులకు కావాల్సిన యూరియా జిల్లాలో అందుబాటులో ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు అవసరం మేర యూరియా వాడుకోవాలని, అవసరానికి మించి యూరియా వినియోగిస్తే భూసారం క్షీణిస్తుందని హెచ్చరించారు. సమావేశంలో ఏఓ నాగరాజు, ఏఈఓ వసంత, తదితరులు పాల్గొన్నారు.


