పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కోర్టులో సవాల్ చేస్తాం..
దుగ్గొండి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా చాలాచోట్ల 10లోపు ఓట్ల తేడాతో వెలువడిన ఫలితాలపై కోర్టును ఆశ్రయిస్తామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మండలంలోని గిర్నిబావి, తొగర్రాయి, తిమ్మంపేట, మహ్మదాపురం, మర్రిపల్లి, వెంకటాపురం గ్రామాల్లో ఓటమి పాలైన యార మోహన్‌రెడ్డి, ఓడేటి వనిత తిరుపతిరెడ్డి, అక్కపెల్లి సుజాత, ఆడెపు రాజు, పెండ్లి ఉమాదేవి, కందిపల్లి నవనీతను పరామర్శించి, అధైర్య పడవద్దని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు, అధికారులు తమ పార్టీ బలపిర్చన అభ్యర్థులను భయబ్రాంతులకు గురిచేసి ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పొన్నం మొగిలి, మాజీ ఎంపీపీ కాట్ల భద్రయ్య, నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజుకుమార్, బొబ్బరోనిపల్లి సర్పంచ్ శంకేసి కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.


