రేపటి నుంచి సైన్స్ కార్నివాల్
విద్యారణ్యపురి: హైస్కూల్ స్థాయి విద్యార్థులకు ఈ నెల 29, 30 తేదీల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు హడుప్సా జిల్లా అధ్యక్షుడు టి.బుచ్చి బాబు, జనరల్ సెక్రటరీ ఎం.సంతోశ్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ డిస్ట్రిక్ట్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ (హడుప్సా) ఆధ్వర్యంలో సైన్స్ కార్నివాల్–25 పేరిట నిర్వహించనున్న ఈ సైన్స్‌ఫెయిర్‌కు సంబంధించిన పోస్టర్‌ను శనివారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో డీఈఓ ఎల్‌వీ గిరిరాజ్‌గౌడ్ ఆవిష్కరించారు. కడిపికొండలోని విశ్వశాంతి హైస్కూల్‌లో ‘వాటర్ కన్సర్వేషన్ అండ్ మేనేజ్‌మెంట్, గ్రీన్ ఎనర్జీ అండ్ ఎ నర్జీ కన్సర్వేషన్, వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ అల్టర్‌నేటివ్స్ టు ప్లాస్టిక్, రిక్రేషన్ మేథమెటికల్ మోడలింగ్, సస్టెయినబుల్ అగ్రికల్చర్’ అనే అంశాలపై ఎగ్జిబిట్స్ విద్యార్థులు ప్రదర్శించనున్నారు. పోస్టర్ ఆవిష్కరణలో హడుప్సా అధ్యక్షుడు బుచ్చిబాబు, అకడమిక్ కన్వీనర్ వీసీ రామారావు, ట్రెజరర్ డి.శంకర్, బాధ్యులు బి.వెంకటరెడ్డి, ఎం.సంపత్‌రెడ్డి, వై.వెంకటేశ్వర్‌రావు, కె.వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.


