దివ్యాంగులకు ధైర్యం కల్పించాలి
రామన్నపేట: దివ్యాంగుల్లో ధైర్యం నింపడం మన అందరి బాధ్యత అని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ప్రాంగణంలో ఐఏఎస్ పరికిపండ్ల నరహరి స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. భగవాన్ మహావీర్ ట్రస్ట్, హైదాబాద్ వారి సహకారంతో శనివారం దివ్యాంగులకు ఉచిత కృత్రిమ కాళ్ల పంపిణీ శిబిరం నిర్వహించారు. మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు అందించడమంటే వారు తిరిగి నడిచే ధైర్యం కల్పించడమేనని పేర్కొన్నారు. అనంతరం ఆలయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఐఏఎస్ పరికిపండ్ల నరహరి మాట్లాడుతూ.. దివ్యాంగులు ఇతరుల దయపై ఆధారపడే వ్యక్తులు కారని, వారికి సరైన అవకాశాలు అందితే గౌరవంగా, స్వావలంబనతో జీవించగలరన్నారు. గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ పాల్గొని శిబిరాన్ని సందర్శించి లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. శిబిరంలో ఉమ్మడి వరంగల్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 150 మందికిపైగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, అవసరాన్ని బట్టి వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ శిబిరంలో వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మహావీర్ ట్రస్ట్ బాధ్యులు ఇంద్రజన్, ఆలయ ఫౌండేషన్ సీఈఓ రమేశ్‌బాబు, అడిషనల్ సీఈఓ రాజేంద్రకుమార్, కీర్తి నాగార్జున, వరంగల్ ఇన్‌చార్జ్ పరికిపండ్ల వేణు, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, నాయకులు కుసుమ సతీశ్, వన్నాల వెంకటరమణ, చిప్ప వెంకటేశ్వర్లు, గాజుల సంపత్, బొజ్జపల్లి సుభాశ్, లింగమూర్తి, ఎలగం చిన్న కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కొండా సురేఖ
ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
కృత్రిమ కాళ్ల పంపిణీ


