బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Nov 26 2025 11:08 AM | Updated on Nov 26 2025 11:08 AM

బుధవా

బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

– 8లోu

న్యూస్‌రీల్‌

మండలాల వారీగా..

పవన్‌..ఉపాధి అదిరెన్‌

మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలానికి చెందిన గిరిజన యువకుడు తేనెటీగల పెంపకంలో అధిక లాభాలను ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

వాతావరణం

జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండతో పాటు ఉక్కపోతగా ఉంటుంది. రాత్రి చలితీవ్రత ఎక్కువగా ఉంటుంది.

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలకు ఎట్టకేలకు మంగళవారం నగారా మోగింది. డిసెంబర్‌ 11, 14, 17 తేదీల్లో.. మూడు విడుతలుగా సర్పంచ్‌, వార్డు సభ్యుల ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్‌ ప్రకటించారు. వాస్తవానికి సెప్టెంబర్‌లోనే షెడ్యూల్‌ విడుదలైంది. రిజర్వేషన్లపై కోర్టు కేసు, వివాదం కారణంగా అక్టోబర్‌ మొదటి వారంలో రద్దయ్యాయి. కోర్టు సూచనల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం కాగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది.

రేపు నోటిఫికేషన్‌.. నామినేషన్ల ప్రక్రియ..

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ రాణి కుముదిని ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం 27న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మొదటి విడతకు ఇదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతకు 30 నుంచి, మూడో విడతకు డిసెంబర్‌ 3 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత ఎన్నికల సంఘం గుర్తులు కేటాయిస్తుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ప్రక్రియ పూర్తికాగానే 11, 14, 17 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించి కౌంటింగ్‌ అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 15,026 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయనున్నారు.

25 రోజులపాటు ఎన్నికల కోడ్‌..

షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో ఎన్నికల కోడ్‌ వెంటనే అమల్లోకి వచ్చిందని అధికారులు ప్రకటించారు. మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో మాత్రం మినహాయింపు ఉంటుంది. కాగా, ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలను కలిపే సరిహద్దుల్లో చెక్‌పోస్టులను నెలకొల్పేందుకు పోలీసు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేటి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యేలా చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా సుమారు 25 రోజులపాటు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు బ్రేక్‌ పడనుంది. ఇదిలా ఉండగా ప్రధాన రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా.. బీఆర్‌ఎస్‌, బీజేపీ కూడా చాలెంజ్‌గా తీసుకుంటున్నాయి. వామపక్షాలు, ఇతర పార్టీలు ‘స్థానిక’ంలో సత్తా చాటేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా.. ప్రధాన పార్టీలు మాత్రం గెలుపు గుర్రాలకే అవకాశం కల్పించేందుకు దృష్టి సారించాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సర్పంచ్‌ స్థానాలను అత్యధికంగా గెలుచుకునేందుకు రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

మోగిన పంచాయతీ

ఎన్నికల నగారా

ఉమ్మడి వరంగల్‌లో అమల్లోకి వచ్చిన కోడ్‌

కార్పొరేషన్‌, మున్సిపాలిటీలకు మినహాయింపు

మండల, జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టుల

ఏర్పాటుకు సన్నాహాలు

పోటాపోటీగా ఆశావహులు.. గెలుపు గుర్రాలకే అవకాశం.. ప్రధాన పార్టీల కసరత్తు

హనుమకొండ జిల్లాలో ఎన్నికలు ఇలా

విడత మండలాలు పంచాయతీలు వార్డులు

మొదటి 3 69 658

రెండు 5 73 694

మూడు 4 68 634

మొత్తం 12 210 1,986

వరంగల్‌ జిల్లాలో ..

మొదటి 3 91 800

రెండు 4 117 1,008

మూడు 4 109 946

మొత్తం 11 317 2,754

మొదటి విడత (డిసెంబర్‌ 11): హనుమకొండ జిల్లాలో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్‌

వరంగల్‌ జిల్లా: వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి

రెండో విడత (డిసెంబర్‌ 14): హనుమకొండ జిల్లాలో ధర్మసాగర్‌, హసన్‌పర్తి, ఐనవోలు, పరకాల, వేలేరు వరంగల్‌ జిల్లా: దుగ్గొండి, నల్లబెల్లి, గీసుకొండ, సంగెం. మూడో విడత (డిసెంబర్‌ 17) : హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట. వరంగల్‌ జిల్లా :

నర్సంపేట, ఖానాపురం, చెన్నారావుపేట, నెక్కొండ

బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 20251
1/3

బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 20252
2/3

బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 20253
3/3

బుధవారం శ్రీ 26 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement