నేడు దీక్షా దివస్ సన్నాహక సమావేశం
నయీంనగర్: హనుమకొండలో బుధవారం జరిగే దీక్షా దివస్ సన్నాహక సమావేశానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నట్లు ఆ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగంగా రక్తదాన శిబిరాలు, తెలంగాణ ఉద్యమకారుల ఛాయాచిత్ర ప్రదర్శన ఉంటుందన్నారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులే కడియం బ్రాండ్ అని ఆరోపించారు. కేంద్రంలో బిడ్డకు మంత్రి పదవి ఇస్తామంటే తండ్రి, బిడ్డ జంప్ అవుతారని అన్నారు. రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, కార్పొరేటర్లు సోదా కిరణ్, చెన్నం మధు, రంజిత్‌రావు, పులి రజనికాంత్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా కేటీఆర్ రాక
బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా
అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్


