అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ.. | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..

Aug 16 2025 8:55 AM | Updated on Aug 16 2025 8:55 AM

అభివృ

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..

భూ భారతి, రెవెన్యూ సంస్కరణలు నగర పర్యాటకం..

ప్రసంగంలో మరికొన్ని అంశాలు ఇలా..

వైఎస్‌ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ..

మాట్లాడుతున్న మంత్రి కొండా సురేఖ

సన్న బియ్యం.. కొత్త రేషన్‌ కార్డులతో ప్రజల్లో ఆనందం

రైతులను ఆదుకునేందుకే రుణమాఫీ, పెట్టుబడి సాయం

పంద్రాగస్టు వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

హనుమకొండ పోలీస్‌పరేడ్‌ గ్రౌండ్‌లో జాతీయ పతాకావిష్కరణ

జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి కొండా సురేఖ, కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

హన్మకొండ అర్బన్‌ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటినుంచి ప్రజా పాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఫలితాలు సాధించిందని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హనుమకొండ పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జాతీయ పతాకావిష్కరణ చేసి పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రంలో, జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తన ప్రసంగంలో ప్రజలకు వివరించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి ఆరు గ్యారంటీ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి కోసం చర్యల్లో భాగంగా క్రీడా పాఠశాల, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ జిల్లాలో ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు తెలిపారు. తాత్కాలికంగా జవహర్‌ లాల్‌ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.

అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట

రైతుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతు భరోసా, రైతుబీమా, రైతు రుణమాఫీ పథకాలను అందిస్తున్నామని మంత్రి సురేఖ తెలిపారు. జిల్లాలోని 54,734 మంది రైతులకు రూ.450.09 కోట్ల రుణాలను మాఫీ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం ఈ వానాకాలం 2025లో 1,44,192 మంది రైతులకు మొదటి విడతగా రూ.6 వేల చొప్పున రూ.152.76 కోట్లను వారి ఖాతాలో జమ చేశామన్నారు.

సన్నబియ్యం..

కొత్త రేషన్‌కార్డులు

ప్రజా ప్రభుత్వం ఉగాదినుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిందన్నారు. జిల్లాలో 2.31 లక్షల ఆహార భద్రతకార్డుదారులకు 414 రేషన్‌ దుకాణాల ద్వారా ప్రతీ ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం, 1,21,01 కొత్త రేషన్‌ కార్డులు, 25,349 కుటుంబ సభ్యులను అదనంగా చేర్చినట్లు వివరించారు. ఆయిల్‌ పామ్‌ విస్తరణ పథకం ద్వారా 2025 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 231మంది రైతులు 734 ఎకరాల్లో సాగుకు రూ.1.11 కోట్లకు పరిపాలనా అనుమతులు పొందినట్లు తెలిపారు.

జిల్లాలోని 164 రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన కల్పించినట్లు మంత్రి తెలిపారు. సదస్సుల ద్వారా ఇప్పటివరకు మొత్తం 36,429 దరఖాస్తులు వచ్చాయన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కరించడానికి 302 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చి నియమిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 163 మంది జీపీఓలను నియమించనున్నట్లు చెప్పారు. అనంతరం ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసపత్రాలు అందించి స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించారు. కార్యక్రమంలో వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు కడియం కావ్య, జిల్లా కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌, అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రమేష్‌ రాథోడ్‌, ఇతర జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కుడా ఆధ్వర్యంలో రూ.30 కోట్లతో భద్రకాళి దేవస్థానంలో మాడవీధుల నిర్మాణం చేపట్టినట్లు మంత్రి సురేఖ తెలిపారు. రూ.4కోట్లతో భద్రకాళి చెరువులో పూడికతీత, రూ.70 కోట్లతో రోప్‌వే, సస్పెన్షన్‌ బ్రిడ్జి, ఇతర పనులు చేపట్టినట్లు వివరించారు. రూ.5 కోట్లతో కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌ ఆధునీకరణ, రూ.4 కోట్లతో ఎల్కతుర్తి కూడలి అభివృద్ధి, రూ.2 కోట్లతో పాత కలెక్టర్‌ నివాస సముదాయం ఆధునికీరించినట్లు చెప్పారు. అదేవిధంగా భీమదేవరపల్లి మండలం వంగరలో రూ.7 కోట్ల నిధులతో చేపట్టిన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విజ్ఞాన వేదిక అభివృద్ధి పనులు చివరి దశలో ఉన్నాయన్నారు.

విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శన..

మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 9 కోట్ల 12 లక్షల మంది మహిళా ప్రయాణికులు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుని రూ.372.99 కోట్ల లబ్ధి పొందారని తెలిపారు.

పరకాలలో రూ.35 కోట్లతో 100 పడకల ఆస్పత్రి, జిల్లాలోని 74 సబ్‌ సెంటర్‌ భవనాల నిర్మాణాలకు రూ.11.45 కోట్లు మంజూరు చేసి పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద జిల్లాలో 2024, ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు రూ.54.19 కోట్ల ఖర్చుతో 21,146 మంది పేదలు వైద్య చికిత్సలు పొందగలిగారని తెలిపారు.

వరంగల్‌ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరయ్యాయన్నారు.

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో కామన్‌ మెనూ అమలు చేస్తున్నామన్నారు. అన్ని పాఠశాలల్లోని వంటశాలలకు ఎల్‌పీజీ కనెక్షన్లు అందిస్తున్నట్లు వివరించారు.

2025–26 సంవత్సరానికిగాను 7,902 మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.483.49 కోట్లు లక్ష్యం కాగా, 1,288 సంఘాలకు రూ.134.52 కోట్లు బ్యాంకు లింకేజి రూపంలో ఇప్పటివరకు రుణాలు అందించామన్నారు.

కల్యాణలక్ష్మి పథకం కింద బీసీ, ఈబీసీ కులాలకు చెందిన 733 జంటలకు 7కోట్ల33లక్షల 85వేల రూపాయలు విడుదల చేసినట్లు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 9,990 ఇళ్లు మంజూరయ్యాయని వివరించారు.

వనమహోత్సవంలో 23 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 13.76 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి జిల్లాలో స్వయం సహాయక సంఘాల ద్వారా 3 క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. 5 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసేందుకు 5 మండల సమాఖ్యలకు రూ.30 లక్షల చొప్పున మొత్తం రూ.1.50 కోట్లను విడుదల చేశారని పేర్కొన్నారు.

మంత్రి సురేఖ తన ప్రసంగంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని, ఆయన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. అధికారిక ప్రసంగపాఠం కాకుండా ఆరోగ్యశ్రీ వంటి విషయాల్లో తన మనస్సులోని భావాలను వేదికపై వెల్లడించారు. నాడు వైఎస్సార్‌ తన మానస పుత్రికగా ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేదలు సైతం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం పొందేలా చేశారన్నారు. దాని కొనసాగింపుగా ప్రస్తుత ప్రభుత్వం మరింత మెరుగైన సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తోందని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ చలువతోనే అమలు చేశామని, దాని ద్వారా ఎంతో మంది విద్యావంతులు అయ్యారని వివరించారు.

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..1
1/7

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..2
2/7

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..3
3/7

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..4
4/7

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..5
5/7

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..6
6/7

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..7
7/7

అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement