స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి

Aug 16 2025 8:55 AM | Updated on Aug 16 2025 8:55 AM

స్పోర

స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి

స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి ‘నవోదయ’ గడువు పెంపు తాటిచెట్లకు పరిహారం విధుల్లో నిర్లక్ష్యం.. వేతనాల్లో కోత పోలీసు కమిషనరేట్‌లో పంద్రాగస్టు వేడుకలు

వరంగల్‌ స్పోర్ట్స్‌ : హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్‌ స్కూల్‌ పనులను శుక్రవారం కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న తరగతి గదులు, ఎంత మందికి వసతి కల్పిస్తున్నారనే వివరాలను డీవైఎస్‌ఓ గుగులోత్‌ అశోక్‌కుమార్‌ను, ఎప్పటి వరకు పనులు పూర్తి చేస్తారని ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 25వ తేదీలోగా తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ కం ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ ఈఈ సురేష్‌బాబు, అధికారులు నరేందర్‌రెడ్డి, రవీందర్‌, డీఎస్‌ఏ కోచ్‌లు ఉన్నారు.

మామునూరు : వరంగల్‌ మామునూరులోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో ఆరోతరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 27వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు నవోదయ ప్రిన్సిపాల్‌ పూర్ణిమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13వ తేదీతో ముగియగా.. విద్యాలయ సమితి మరోమారు గడువు పెంచుతూ అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ కోరారు.

హసన్‌పర్తి : మండలంలోని సిద్ధాపురంలో గల అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఫార్మ్‌ను వ్యవసాయ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎ.జానయ్య శుక్రవారం సందర్శించి అక్కడి పనులను అడిగి తెలుసుకున్నారు. రీసెర్చ్‌ ఫార్మ్‌కు 50 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వీసీకి వివరించారు. అయితే ఈ భూమిలో తాటిచెట్లు ఉన్నందున గీత కార్మికులతో వీసీ జానయ్య మాట్లాడారు. అనంతరం నష్టపోతున్న తాటిచెట్లకు పరిహారం చెక్కులు అందజేశారు. వ్యవసాయ సహాయ సంచాలకులు డాక్టర్‌ ఉమారెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

రామన్నపేట : విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అనుమతి లేకుండా గైర్హాజరైన ఆరుగురు జవాన్ల వేతనాల్లో కోత విధిస్తున్నట్లు బల్దియా సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి శుక్రవారం తెలిపారు. 9,10 డివిజన్లలో క్షేత్రస్థాయిలో హాజరును తనిఖీ చేసే క్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది కనీసం 50 శాతం హాజరు నమోదు కాలేదని, 3–4 రోజులు వారి పనితీరును గమనించి విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆరుగురు జవాన్ల వేతనంలో ఒక రోజు కోత విధించినట్లు పేర్కొన్నారు. ఇలాగే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే కఠిన చర్యలతో పాటు విధుల నుంచి తొలగిస్తామని సీఎంహెచ్‌ఓ హెచ్చరించారు.

వరంగల్‌ క్రైం : వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి సెల్యూట్‌ చేశారు. అనంతరం అధికారులు, సిబ్బంది, చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్‌రావు, సురేష్‌కుమార్‌, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు, పరిపాలన విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి1
1/2

స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి

స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి2
2/2

స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement