
ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందడి
● రుద్రేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్ : చారిత్రక వేయిస్తంభాల గుడిలో శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా రుద్రేశ్వరస్వామి వారిని విభూది, గంధంతో అలంకరించారు. ప్రత్యేక పూజలు, మహా హారతి నిర్వహించి, దర్శనం కల్పించారు. ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో గణపతికి అభిషేకం, స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు.
భద్రకాళి దేవాలయంలో..
భద్రకాళి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి శ్రావణమాస పూజలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో సందర్శించారు. మేయర్ గుండు సుధారాణి ఒడిబియ్యం, చీర సమర్పించారు. న్యూఢిల్లీకి చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోస్ట్ జితేంద్రగుప్తా, సీపీఎంజీ తెలంగాణ పీవీఎస్ రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. వారితో పాటు వరంగల్ ఎస్పీ రవికుమార్, హనుమకొండ ఎస్పీ హనుమంతు, సీతారాం, వెంకన్న ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆలయ ఈఓ రామల సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఆలయాల్లో శ్రావణ శుక్రవారం సందడి