
మా సమస్యలు పట్టించుకోరా?
● స్వాతంత్య్ర సమరయోధుల వినతి
హన్మకొండ అర్బన్: తమ సమస్యలను పరిష్కరించాలని స్వాతంత్య్ర సమరయోధులు కోరారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హనుమకొండ పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ.. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించే క్రమంలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తాము భూ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు విన్నవించినా పట్టించుకోలేదని అన్నారు. కాగా, మంత్రి ఆ వినతిని కలెక్టర్‌కు ఇచ్చి పరిశీలించాలన్నారు.