
‘నిమ్స్’ అధికారికి ఎంపీ బలరాం న
గీసుకొండ: మండలంలోని ఎలుకుర్తిహవేలి గ్రామంలో హైదరాబాద్ ‘నిమ్స్’ ఆస్పత్రి లైజనింగ్ అధికారి డాక్టర్ మార్త రమేశ్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ ఆదివారం డాక్టర్ రమేశ్ ఇంటికి చేరుకుని పరామర్శించారు. అలాగే బీజేపీ మాజీ ఎంపీ బీబీ పాటిల్, కాంగ్రెస్ మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, రిటైర్డ్ డీఎంహెచ్‌వో డాక్టర్ సాంబశివరావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తుమ్మనపెల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ తిప్పారపు రవీందర్, కాంగ్రెస్ నాయకులు బొడిగె శోభన్‌బాబు తదితరులు మార్త రమేశ్‌ను కలిసి సానుభూతి ప్రకటించారు.
‘పాకాల’లో పర్యాటకుల సందడి
ఖానాపురం: మండలంలోని పాకాల సరస్సు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. విద్యార్థులకు వరుసగా రెండురోజులు సెలవులు కావడంతో నర్సంపేట డివిజన్‌తోపాటు వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు భారీగా తరలివచ్చారు. తూముద్వారా లీకేజీ అవుతున్న నీటిలో జలకాలాడుతూ ఉత్సాహంగా గడిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన పార్కులో పిల్లలు ఆటలాడారు. బోటింగ్ చేస్తూ అందాలను వీక్షించారు.
26.5 ఫీట్లకు చేరిన నీరు..
పాకాల సరస్సు నీటిమట్టం 26.5 ఫీట్లకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 30.3 ఫీట్లు. కురుస్తున్న వర్షాలతో సరస్సులోకి నీటిమట్టం వచ్చి చేరింది. మరో 3.8 ఫీట్ల నీరు చేరితే సరస్సు మత్తడిపోయనుంది.
ఖాళీ బిందెలతో రోడ్డెక్కి..
నల్లబెల్లి: మండల కేంద్ర శివారు మూడుచెక్కలపల్లి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బస్టాండ్ ఆవరణలో మహిళలు ఆదివారం రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. 15 రోజులుగా తాగునీరు అందడంలేదని వాపోయారు. గ్రామంలో అధికారులు ఐదు బోర్లు వేశారని, కానీ తరచుగా రిపేర్లకు వస్తుండడంతో ఏ ఒక్క బోరు కూడా పనిచేయడం లేదన్నారు. సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తి అయినా.. కొన్నాళ్లు మాజీ సర్పంచ్ పూల్‌సింగ్ బోర్ల మరమ్మతు పనులు చేయించి మంచినీటి సరఫరా సక్రమంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వం నుంచి పెండింగ్ బిల్లులతో పాటు ప్రస్తుతం చేపట్టిన పనులకు సైతం అధికారులు బిల్లులు చేయకపోవడంతో మరమ్మతు పనులు చేపించేందుకు ఎవరూ ముందుకు రావడంలేదన్నారు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేయించలేనని పంచాయతీ కార్యదర్శి సెలవులో వెళ్లినట్టు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో
తొగర్రాయి వాసి మృతి
దుగ్గొండి: ప్రమాదవశాత్తు మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని తొగర్రాయి గ్రామానికి చెందిన చిలువేరు సాగర్ (23) ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. గ్రామానికి చెందిన చిలువేరు నారాయణ చిన్న కుమారుడు చిలువేరు సాగర్ మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని ఓ డిఫెన్స్ అకాడమీలో కొంతకాలంగా శిక్షణ పొందుతున్నాడు. ఈక్రమంలో సాయంత్రం తన మిత్రులు రాకేశ్, విష్ణువర్ధన్‌తో కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టడంతో తీవ్రగాయాలతో సాగర్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్ననాటి నుంచి దేశానికి సేవ చేయాలన్న కల నెరవేరకుండానే మృత్యుఒడిలోకి చేరాడని సాగర్ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

‘నిమ్స్’ అధికారికి ఎంపీ బలరాం న

‘నిమ్స్’ అధికారికి ఎంపీ బలరాం న