
సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా చర్యలు
● వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
న్యూశాయంపేట: సౌర విద్యుత్ ఉత్పాదకత దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి (ఎనర్జీ) నవీన్ మిట్టల్, రెడ్‌కో సీఎండీ, ఎస్పీడీసీఎల్ సీఎండీ సింగరేణి సీఎండీలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సోలార్ సిస్టం ఇన్‌స్టలేషన్‌పై సమీక్షించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల వివరాలతో నిర్ణీత నమూనా ప్రకారం నివేదిక రూపొందించి వారంలోగా సమర్పించాలని ఆదేశించారు. కలెక్టర్ సత్యశారద కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. జిల్లాలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు స్థలాల వివరాలు సేకరిస్తామని తెలిపారు.