‘ముఖం’ చూపించాల్సిందే..! | - | Sakshi
Sakshi News home page

‘ముఖం’ చూపించాల్సిందే..!

Aug 1 2025 5:52 AM | Updated on Aug 1 2025 5:52 AM

‘ముఖం’ చూపించాల్సిందే..!

‘ముఖం’ చూపించాల్సిందే..!

విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఇక ముఖ గుర్తింపు (ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌)) హాజరు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఈఓలు ఆయా ఎంఈఓలు, హెచ్‌ఎంలను గురువారం ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరినుంచి రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా టీచర్ల ముఖగుర్తింపు హాజరును అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతం కావడంతో నేటి(శుక్రవారం)నుంచి రాష్ట్రవ్యాప్తంగా, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, కేజీబీవీలు, మోడల్‌ స్కూల్స్‌, యూఆర్‌ఎస్‌, టీజీఆర్‌ఈఐఎస్‌లలో అమలు చేయనున్నారు.

డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ ద్వారా..

ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు తీసుకుంటున్నారు. అందుకు డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (డీఎస్‌ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌) యాప్‌ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్‌ ద్వారా హెచ్‌ఎంలు, టీచర్ల, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల ముఖ గుర్తింపు హాజరు అమలుచేయనున్నా రు. హెచ్‌ఎంలు తమ సెల్‌ఫోన్‌లోని డీఎస్‌ఈ యాప్‌లో టీచర్‌ మా డ్యూల్‌ టీచర్లకు, నాన్‌టీచింగ్‌ మాడ్యూల్‌లో నాన్‌టీచింగ్‌ సిబ్బందికి రిజిస్ట్రేషన్‌ చేయాలి. ఫొటో తీసి వారి వివరాలు, పాఠశాల సమయం తదితర వివరాలు అప్‌లోడ్‌ చేయాలి. రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక టీచర్లు, నాన్‌టీచింగ్‌ సిబ్బంది తమతమ సెల్‌ఫోన్లలో సంబంధిత యాప్‌లో ఇక ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ తీసుకోవచ్చు. నేటినుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. జియోట్యాగింగ్‌ను కూడా ఇస్తారు. పాఠశాలలోనే ముఖ గుర్తింపు హాజరు తీసుకోవాల్సి. ఒకవేళ సెలవు పెడితే తప్పనిసరిగా యాప్‌లో రిక్వెస్ట్‌ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు డీఈఓలకు డెమో ఇచ్చినట్లు సమాచారం. విద్యార్థులకు ఇప్పటికే ముఖగుర్తింపు హాజరు తీసుకుంటున్నప్పటికీ కొన్నిపాఠశాలల్లో అమలుచేయటంలేదు. ఇందుకు పలు కారణాలు చూపుతున్నారు.

ప్రభుత్వ పాఠశాలల వేళలు ఇలా

పీఎస్‌లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, యూపీఎస్‌లు, హైస్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటలవరకు పనివేళలున్నాయి. టీచర్లు ఉదయం నిర్దేశించిన సమయం కంటే ముందుగానే, సాయంత్రం విధుల సమయం ముగిశాక అంటే రోజుకు రెండుసార్లు ముఖ గుర్తింపు హాజరు తీసుకోవాల్సింటుంది.

ఇప్పటికే కలెక్టర్‌

ప్రతీరోజు సమీక్ష..

హనుమకొండ జిల్లాలో ఇప్పటికే విద్యార్థులకు తీసుకుంటున్న ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ను కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ ప్రతీరోజు సమీక్షిస్తున్నారు. హాజరు తక్కువగా ఉన్న పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఇప్పుడు టీచర్ల ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌ను సైతం కలెక్టర్‌ ఏరోజుకారోజు పర్యవేక్షించే అవకాశం ఉంది. మరోవైపు డీఈఓ కార్యాలయాల్లో డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేస్తారు. డీఈఓలు కూడా టీచర్ల అటెండెన్స్‌ను పర్యవేక్షిస్తారు.

డుమ్మాకు చెక్‌పడినట్లేనా..?

విధులకు డుమ్మా కొట్టే కొందరు టీచర్లకు ముఖగుర్తింపు హాజరుతో చెక్‌పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. జిల్లా కేంద్రాలనుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే టీచర్లు కొందరు సక్రమంగా విధులు నిర్వర్తించడంలేదనే ఆరోపణలున్నాయి. ఆలస్యంగా వెళ్లడం, సాయంత్రం నిర్దేశించిన సమయం కంటే ముందే వెళ్లిపోవడంలాంటివి జరుగుతున్నాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రం నుంచి ఇతర జిల్లాలకు రైలు, బస్సుల ద్వారా, గ్రామీణ ప్రాంతాలకు షటిల్‌ సర్వీస్‌ చేసే టీచర్లు ఉన్నారు. ఈ ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌తో వారికి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. డీఈఓలతోపాటు హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ అటెండెన్స్‌పై ప్రతీరోజు పర్యవేక్షిస్తారు.

నేటినుంచి పాఠశాలల్లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స్‌

కొందరు ఉపాధ్యాయుల

డుమ్మాలకు చెక్‌ పడినట్లే..

విద్యార్థులకు ఉపయోగిస్తున్న

డీఎస్‌ఈ యాప్‌నే వినియోగం

నాలుగు రోజులపాటు

రిజిస్ట్రేషన్‌కు అవకాశం

ప్రభుత్వ స్కూల్స్‌, కేజీబీవీలు,

మోడల్‌స్కూల్స్‌, యూఆర్‌ఎస్‌, సాధారణ

గురుకులాల్లోనూ అమలు

డీఈఓ, కలెక్టర్లు ప్రతీరోజు పర్యవేక్షణ..

వరంగల్‌ జిల్లాలో..

ప్రభుత్వ పీఎస్‌, యూపీఎస్‌,

జెడ్పీ హైస్కూళ్లు 513

అన్ని కేటగిరీల టీచర్లు 2,767

కేజీబీవీలు 10

టీచింగ్‌, నాన్‌టీచింగ్‌ 147

టీజీ మోడల్‌ స్కూళ్లు 06

టీచర్లు 133

యూఆర్‌ఎస్‌ 01

టీచర్లు 06

టీజీఆర్‌ఈఐ 01

టీచర్లు 25

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement