
ఖాతాదారులు బీమా కలిగి ఉండాలి
సంగెం: బ్యాంకు ఖాతాదారులు విధిగా బీమా కలిగి ఉండాలని రిజర్వ్ బ్యాంకు జనరల్ మేనేజర్ ముత్యాల జ్ఞానసుప్రభాత్ సూచించారు. చింతలపల్లిలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో గురువారం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సద స్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకోవాలన్నారు. బీమా చేయించుకుంటే కుటుంబాలకు భరోసా ఉంటుందన్నారు. ప్రధా న మంత్రి జీవనజ్యోతి బీమా యోజన కలిగి ఉండి కుంటపల్లి గ్రామానికి చెందిన జున్న రమేశ్ ఇటీవల అనార్యోగంతో మరణించగా.. నామిని అయిన అతడి భార్య సరితకు రూ.2 లక్షల చెక్కు అందజేశారు. రిజర్వ్ బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ తాన్య సంగ్మా, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ రాజు, డీఎంఎఫ్‌ఐసీ శ్రీనివాస్, టీజీబీ మేనేజర్ వెంకయ్య, యూబీఐ మేనేజర్ చందు, ఎఫ్‌ఎల్‌సీసీ టి.భాస్కరాచారి, ఎల్‌డీఎం ఆఫీసర్ రవి, సీసీ బొజ్జ సురేశ్, వీఓఏలు మంజుల, ప్రవీణ లత, మాజీ ఉప సర్పంచ్ బండి రాధిక పాల్గొన్నారు.
రిజర్వ్ బ్యాంకు జనరల్ మేనేజర్
ముత్యాల జ్ఞాన సుప్రభాత్