శిక్షణలో నేర్చుకున్నవి అమలు చేయాలి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయులు శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేయాలని నాణ్యమైన విద్యాబోధన, నూతన పద్ధతుల్లో బోధించాలని వరంగల్ విద్యాశాఖ క్వాలిటీ కో–ఆర్డి నేటర్ సుజన్‌తేజ అనఅనఅన్నారు. వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో పని చేస్తున్న వివిధ సబ్జెక్టుల టీచర్లకు ఐదురోజులగా ఉర్సు గుట్ట వద్ద ఉన్న బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో నిర్వహిస్తున్న శిక్షణ బుధవారం సాయంత్రం ముగిసింది. ఈముగింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. టీచర్లు సాంకేతికతను ఉపయోగించుకుని ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానల్స్ ద్వారా విద్యార్థులకు డిజిటల్ తరగతి బోధనలు చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. జిల్లా రిసోర్స్ పర్సన్లుగా శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ఈ ముగింపు సమావేశంలో ఘనంగా సన్మానించారు. సమావేశంలో శిక్షణా కేంద్రం ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్‌రావు, డీసీఈబీ సెక్రటరీ జి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో మూడు దశల్లో మొత్తంగా సుమారు 1,800 మంది స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ పూర్తయ్యింది.
జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ సుజన్‌తేజ
ముగిసిన టీచర్ల శిక్షణ


