కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి
సంగెం: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కాపులకనిపర్తి సొసైటీ ఆధ్వర్యంలో తీగరాజుపల్లి, షాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏ–గ్రేడ్ ధాన్యానికి రూ 2,320, కామన్ రకానికి రూ.2,300 మద్దతు ధర, సన్నధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తున్నదన్నారు. రైతులు 17 శాతం తేమతో నాణ్యతా ప్రమాణాలు పాటించి ధాన్యం తీసుకు రావాలని, దళారులను ఆశ్రయించి మోసపోవొద్దని సూచించారు. పండించిన ప్రతీ ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. కల్లాల వద్ద కాంటాలు ఆలస్యం కాకుండా, లారీలు వచ్చేలా చూడాలని అధికారులకు సూచించారు. సొసైటీ చైర్మన్ సంపత్‌గౌడ్, మండల ప్రత్యేకాధికారి రమేశ్, ఎంపీడీఓ రవీందర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కీరునాయక్, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, మధుసూదన్, ఏఓ యాకయ్య, ఏఈఓ సరిత, సొసైటీ సీఈఓ రమణాచారి, సెంటర్ ఇన్‌చార్జ్‌లు మాలతి, భిక్షపతి, నవీన్ పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
తీగరాజుపల్లి, షాపూర్ గ్రామాల్లో
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం


