
సమావేశ ంలో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రావీణ్య
వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య
కరీమాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో నోడల్ అధికారుల పాత్ర కీలకమని వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా నోడల్ అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఫిర్యాదుల పరిష్కారం, నామినేషన్ల స్వీకరణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఎన్నికల విధులకు సంబంధించి ప్రతీ అంశంపై నోడల్ అధికారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈసమావేశంలో డీఆర్‌ఓ శ్రీనివాస్, డీఆర్‌డీఓ కౌసల్యాదేవి, డీపీఓ కల్పన, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డాక్టర్ బాలకృష్ణ, పుష్పలత, సౌజన్య, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్, విశ్వనారాయణ పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, వీడియో బృందాలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ బృందాల పాత్ర కీలకమన్నారు. ఈ సమావేశంలో నోడల్ అధికారులు రాంరెడ్డి, సంజీవరెడ్డి, పుష్పలత, అధికారులు పాల్గొన్నారు.