
కాశిబుగ్గ: మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్న సిబ్బంది
కాశిబుగ్గ: అగ్ని ప్రమాదాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వరంగల్ అగ్నిమాపక కేంద్రం ఫైర్ అధికారి బి. రవీందర్ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్, వరంగల్ చౌరస్తా, పోచమ్మమైదాన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాక్‌డ్రిల్ ప్రదర్శన చేసి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాలు సంభవిస్తే వాటిని ఆర్పే ప్రయత్నం చేస్తూ 101, 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారులు ఎం.గణేష్, పి.సురేందర్, ఎండీ నబి, కె.రవి, గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన
వర్ధన్నపేట: అగ్ని ప్రమాదాలు సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ మార్గాలపై ప్రతిఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని వర్ధన్నపేట అగ్రిమాపక అధికారి భద్రయ్య అన్నారు. అగ్ని మాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం వర్ధన్నపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి భద్రయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు వేసవి కాలంలో ఎక్కువగా జరిగే ప్రమాదముందన్నారు. అగ్ని ప్రమాదం సంభవించినపుడు అగ్నిమాపక కేంద్రానికి వెంటనే సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

వర్ధన్నపేట: అగ్నిప్రమాద నివారణపై ప్రదర్శన ఇస్తున్న సిబ్బంది