
మేడారం (మంగపేట): జాతరకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. మంగళవారం సాయంత్రం నుంచే తాకిడి పెరిగింది. బుధవారం జారత ప్రారంభ నేపథ్యంలో కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దైపెకి తీసుకువచ్చే అపూర్వ ఘట్టాన్ని వీక్షించి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పలు రాష్ట్రాల నుంచి ఎడ్ల బండ్లు, ఆర్టీసీ బస్సులు, కార్లు, ట్రాక్టర్లు, ఇతర ప్రైవేట్ వాహనాల్లో మేడారం చేరుకుంటున్నారు. రెడ్డిగూడెం, ఊరట్టం, కన్నెపల్లి, కొత్తూరు, శివరాంసాగర్, చిలకలగుట్ట తదితర ప్రాంతాలు మంగళవారం మధ్యాహ్నం వరకు ఖాళీగా దర్శనమివ్వగా సాయంత్రం 5గంటల తర్వాత భక్తుల గుడారాలు వెలిశాయి. అశేష భక్తజనంతో మేడారంలో సందడి నెలకొంది.
వనంలోకి జనం: మేడారం పరిసరాల్లో వెలిసిన భక్తుల గుడారాలు
తల్లీ..వస్తున్నాం : మేడారానికి తరలివస్తున్న భక్తులు
7
న్యూస్‌రీల్
