అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ ప్రావీణ్య
కరీమాబాద్: పరీక్షల నిర్వహణకు నియమితులైన అధికారులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఈనెల 11న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 24 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. ప్రిలిమ్స్ రాసే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు. ప్రతీ సెంటర్‌లో సీసీ టీవీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులంతా ఉదయం 10:15 గంటలకల్లా సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. లైజనింగ్ అధికారులుగా 24 మంది, రూట్ ఆఫీసర్లుగా ఆరుగురిని నియమించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకనుగుణంగా అధికారులు పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రతీ సెంటర్‌లో పోలీస్ బందోబస్తు ఉంటుందన్నారు. పరీక్ష మొదలైనప్పటి నుంచి మెటీరియల్ కలెక్టరేట్‌కు చేరేవరకు లైజనింగ్ అధికారులు మానిటరింగ్ చేయాలన్నారు. పరీక్షకు 9,716 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ శ్రీవత్స, ఆర్డీఓ మహేందర్‌జీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రావీణ్య
గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష


