విద్యార్థిని కాలు కొరికిన ఎలుకలు | Rats Bite Students In warangal | Sakshi
Sakshi News home page

విద్యార్థిని కాలు కొరికిన ఎలుకలు

Mar 7 2023 1:30 AM | Updated on Mar 7 2023 8:44 AM

Rats Bite Students In warangal - Sakshi

ఎలుక కొరికిన పీజీ విద్యార్థిని పాదం మడిమ

విద్యార్థిని పాదం మడిమెను ఆదివారం రాత్రి ఎలుకలు కొరికాయి.

కేయూ క్యాంపస్‌: కేయూ మహిళా హాస్టల్‌ డీ బ్లాక్‌లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగానికి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థిని పాదం మడిమెను ఆదివారం రాత్రి ఎలుకలు కొరికాయి. విద్యార్థిని ఆదివారం రాత్రి పడుకున్న సమయంలో కొరికినట్లు హాస్టల్‌ సిబ్బందికి తెలపగా.. టీటీ వేయించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎలుక కొరికిన విషయమై ఆ విద్యార్థిని సంబంధిత విభాగం ప్రొఫెసర్‌ల దృష్టికి సోమవారం తీసుకెళ్లారు.

అంతకుముందు రోజు కూడా మరో విభాగం విద్యార్థినిని కూడా ఎలుకలు కొరికినట్లు తెలుస్తోంది. మహిళా హాస్టల్‌లోని డీ బ్లాక్‌లో ఎలుకలు ఉన్నాయని విద్యార్థినులు చెబుతున్నా వాటిని నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement