ఫలించిన చివరి ప్రయత్నం | - | Sakshi
Sakshi News home page

ఫలించిన చివరి ప్రయత్నం

Nov 28 2026 12:20 AM | Updated on Nov 28 2026 12:20 AM

250 ఎకరాలకుపైగా..

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల

●

అమరచింత: ప్రియదర్శిని జూరాల జలాశయం ఆయకట్టులో అక్కడక్కడ పొట్టదశలో మిగిలిన వరి పంటలకు చివరి తడిగా శుక్రవారం కాల్వలకు నీటిని వదలడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ప్రధాన ఎడమ కాల్వకు వెయ్యి క్యూసెక్కులు, కుడి కాల్వకు 425 క్యూసెక్కుల నీటిని శుక్రవారం విడుదల చేశారు. ఆయకట్టులో వానాకాలం వరి సాగుచేసిన రైతులు నీటికోసం ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ప్రభుత్వం చొరవ, అధికారుల ఉదాసీనతతో సాగుచేసిన వరి పంటలు సకాలంలో చేతికందుతున్నాయి. ఆయకట్టు మొత్తంతో 10 శాతం మేర అక్కడక్కడ వరి పంటలు పొట్టదశలో ఉండటంతో ఒక్క తడి సాగునీరు ఇస్తే తమ పంటలు చేతికందుతాయని రైతులు అధికారులను వేడుకున్న తరుణంలో చివరి తడిగా నీటిని వదిలారు. పలు అవాంతరాలను అధిగమించి చిట్టచివరకు పంటలకు సాగునీరు పొందిన రైతులు ప్రస్తుతం కోత పనుల్లో నిమగ్నమయ్యారు. ఎల్‌నిలో ప్రభావంతో బయటి మార్కెట్‌లో వరికి అధిక ధరలు పలుకుతుండటంతో పెట్టిన పెట్టుబడి చేతికందుతుందనే ఆశతో రైతులు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

● జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలోని 85 వేల ఎకరాల ఆయకట్టులో రైతులు వరి సాగు చేశారు. వీటిలో కేవలం రామన్‌పాడు వరకు ఉన్న అమరచింత, ఆత్మకూర్‌ మండలాల్లోనే 20 వేల ఎకరాల్లో వరి సాగైంది. అలాగే జూరాలను అనుసంధానంగా ఉన్న అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో 650 ఎకరాల్లో వరి సాగుచేశారు.

అమరచింత, ఆత్మకూర్‌ మండలాల పరిధిలో ఉన్న జూరాల ఆయకట్టు రైతులు రామన్‌పాడు వరకు ఉన్న ప్రధాన ఎడమకాల్వ నుంచి సాగునీరు పొందుతారు. ఈ ఏడాది వరణుడు కరుణించకపోవడంతో వానాకాలంలో సైతం వారాబందీ విధానంలో ఆయకట్టుకు సాగునీరు వదిలారు. అయితే ఆత్మకూర్‌ మండలంలోని కట్టకింది పల్లెలకు డీ–6 పిల్ల కాల్వ ద్వారా నీరు పూర్తిస్థాయిలో సాగునీరు అందలేదు. ప్రస్తుతం ఇరు మండలాల్లో 250 ఎకరాలకుపైగా వరి పంటలకు చివరి తడి కోసం ఎదురుచూసిన రైతులు ఒక్కతడి సాగునీరు ఇవ్వాలని పలుమార్లు ప్రాజెక్టు అధికారులను విన్నవించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement