ఎస్‌ఐ రాత పరీక్షకు 10,653 మంది | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ రాత పరీక్షకు 10,653 మంది

Nov 28 2026 12:20 AM | Updated on Nov 28 2026 12:20 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: ఈనెల 29న నిర్వహించనున్న ఎస్‌ఐ రాత పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి 10,653 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఇందుకోసం 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 200 మార్కులకు 200 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయని, తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, నిర్ణీత సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రాల గేట్లు మూసిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఎస్పీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement