బీఎఫ్‌ఎస్‌సీలో ప్రవేశాలకు స్పాట్‌ కౌన్సెలింగ్‌ | - | Sakshi
Sakshi News home page

బీఎఫ్‌ఎస్‌సీలో ప్రవేశాలకు స్పాట్‌ కౌన్సెలింగ్‌

Nov 28 2026 12:20 AM | Updated on Nov 28 2026 12:20 AM

వనపర్తి రూరల్‌: పెబ్బేరులోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న మత్స్య కళాశాలలో బీఎఫ్‌ఎస్‌సీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైనన్స్‌) కోర్సులో 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని మత్య్స కళాశాల అసోసియేట్‌ డీన్‌ డా. సకారం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. భర్తీకి ఈ నెల 30న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్‌ కార్యాలయంలో కౌన్సెలింగ్‌ ఉంటుందని.. ఇంటర్మీడియట్‌ బైపీసీలో ఉత్తీర్ణులై టీజీ ఈఏపీసెట్‌–2026 ర్యాంకు కలిగిన విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాల ఒరిజినల్స్‌తో పాటు జిరాక్స్‌ ప్రతులతో హాజరుకావాలని.. పూర్తి వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు.

నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలి

వనపర్తి రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే అధిక ఉష్ణోగ్రతలు, నీటిఎద్దడి నుంచి బత్తాయి తోటలను కాపాడుకునేందుకు డ్రిప్‌, మల్చింగ్‌ వంటి నీటి సంరక్షణ పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్‌ సూచించారు. గురువారం పెబ్బేరు మండలంలోని తిప్పాయిపల్లిలో రైతు చిన్నబాబు సాగుచేసిన బత్తాయి తోటలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో జిల్లా ఉద్యాన అధికారి, కేవీకే శాస్త్రవేత్త డా. రాజేందర్‌రెడ్డి, మోజర్ల ఉద్యాన కళాశాల శాస్త్రవేత్త డా. కళాధర్‌ బాబు రైతులకు శాసీ్త్రయ సాగు, పోషక యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, ఎల్‌నినో ప్రభావంపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేరుకుళ్లు, గమ్మోసిస్‌, సిట్రస్‌ క్యాంకర్‌, నల్లి వంటి చీడపీడలు, తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని వివరించారు. తోటల్లో నీరు నిల్వ ఉండకుండా మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పూత, పిందెలు రాలకుండా సరైన నీటి యాజమాన్యం, సమతుల పోషకాల వినియోగం, సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. శాసీ్త్రయ పద్ధతులు పాటించి నాణ్యమైన పండ్లతో అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రాముడు, ఉద్యాన అధికారి కృష్ణయ్య, ఉద్యాన విస్తరణ అధికారి బాలప్రకాష్‌, క్లస్టర్‌ అధికారులు రవి, రాజు, పెబ్బేరు, మండల బత్తాయి రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement