వనపర్తిటౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు శనివారం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలో నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. బాలుర ఉన్నత పాఠశాల పాఠశాల ఏ కేంద్రం, బాలికల ఉన్నత పాఠశాల బి కేంద్రం, బాలుర ఉన్నత పాఠశాల, చాణక్య ఉన్నత పాఠశాలలో పరీక్ష జరగనుంది. మొత్తం 1,068 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణకు నలుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, నలుగురు కేంద్రస్థాయి పరిశీలకులు, 52 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. శుక్రవారం సాయంత్రానికి నాలుగు పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పూర్తి చేశారు. విద్యార్థులను పరీక్ష సమయానికి ముందుగానే కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. పరీక్ష ప్రశాంతంగా జరిగేలా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇన్చార్జి జిల్లా విద్యాధికారి యాదయ్య, ఏసీజీ కె.గణేష్ కుమార్ తెలిపారు.
● జిల్లాకేంద్రంలో నాలుగు కేంద్రాలు
● ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
● హాజరుకానున్న 1,068 మంది విద్యార్థులు


