జూరాల కాల్వ నీరు సమృద్ధిగా వస్తుందనే ఆశతో ఈసారి 13 ఎకరాల్లో పంటసాగు చేస్తున్నా. వీటిలో 10 ఎకరాల్లో వరిపంట, 3 ఎకరాల్లో మినుము పంట వేశాను. ఇప్పటికే పంట పెట్టుబడితో పాటు కౌలు కోసం రూ. 3లక్షలు ఖర్చయ్యాయి. కాల్వకు సాగునీటిని నిలిపివేయడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి. అధికారులు స్పందించి సాగునీరు విడుదల చేయాలి.
– కావలి రాజు, రైతు, మొట్లంపల్లి
ప్రస్తుతం జూరాలలో తాగునీటి అవసరాల మేరకు మాత్రమే నీరు అందుబాటులో ఉన్నాయి. ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడంతో కాల్వలకు సాగునీటిని వదలవద్దని పైనుంచి అధికారుల ఆదేశాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. – చంద్రశేఖర్, ఎస్‌ఈ
●


