ఊరి పేరు.. తకరారు! | - | Sakshi
Sakshi News home page

ఊరి పేరు.. తకరారు!

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు మల్‌రెడ్డి నర్సింహారెడ్డి. ఈయన తన సొంత పొలం 5 ఎకరాలతో పాటు మరో 4 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వరి సాగుచేశాడు. ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌లో తమ గ్రామం పేరు అమరచింత మండలంలో చూపిస్తుండడంతో ఎరువులు అక్కడ బుకింగ్‌ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరియా బస్తా రూ.300 ఉంటే అక్కడి

నుంచి తమ గ్రామానికి రవాణాకు రూ.200 చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు లక్ష్మణ్‌గౌడ్‌. 4 ఎకరాల్లోవరి సాగు చేశాడు. గతంలో ఫర్టిలైజర్‌ యాప్‌లో యూరియా ఒక్కటే బుకింగ్‌ చేసుకునే వారమని, ఇప్పుడు ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌ అందుబాటులోకి రావడంతో అన్ని రకాల కాంప్లెక్స్‌

ఎరువులు ఆన్‌లైన్‌లోనే బుకింగ్‌ చేసుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. రెండు, మూడు బస్తాల ఎరువులు అవసరమైనా 45 కిలోమీటర్ల దూరంలోని అమరచింత మండలంలోనే చూపిస్తున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. రెండు, మూడు బస్తాల కోసమైనా ఆటో తీసుకొని వెళ్తే కిరాయి రూ.1,500 నుంచి 2 వేలు చెల్లించాల్సి వస్తోందంటున్నారు.

సమస్య పరిష్కారంపై దృష్టి

పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి రైతులు ఇబ్బందులు పడుతున్న వాస్తవం. సమస్య మా దృష్టిలో ఉంది. ప్రస్తుతం ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌లో వారికి అమరచింత మండలంలోని పామిరెడ్డిపల్లిలో ఫర్టిలైజర్స్‌ వివరాలు చూపెడుతుంది. సమస్యను కలెక్టర్‌, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. వారం రోజుల వ్యవధిలో పూర్తిగా పరిష్కరిచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అంతలోపు కొత్తకోట నుంచి రెండు లారీల యూరియా తీసుకెళ్లా స్థానిక రైతువేదిక వద్ద అందుబాటులో ఉంచుతాం.

– సైదులు యాదవ్‌, ఏఓ, పెద్దమందడి

అమరచింత: వనపర్తి జిల్లాలోని అమరచింత మండలంలో ఒక పాంరెడ్డిపల్లి, పెద్దమందడి మండలంలో మరో పామిరెడ్డిపల్లి ఉండడంతో ఫార్మర్‌ రిజిస్ట్రీలో ఇ బ్బందులు తలెత్తున్నాయి. పెద్దమందడి మండలంలో ని పామిరెడ్డిపల్లికి చెందిన రెవెన్యూ భూములను అమరచింత పాంరెడ్డిపల్లిలో రెవెన్యూ రికార్డులో చూపుతుండడంతో ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌లో ఎరువుల బుకింగ్‌కు అవస్థలు తప్పడం లేదు. కానీ సమస్యను పరిష్కరించాల్సిన జిల్లా వ్యవసాయ అధికారులు నెలల తరబడి చోద్యం చూస్తున్నారు. రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. కాలం వెళ్లదీస్తున్నారే తప్పా శాశ్వత పరిష్కారం చూపడం లేదు.

45 కి.మీ. వెళ్లాల్సిందే..

పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి రెవెన్యూలో ముందరితండా, చీకరుచెట్టుతండా, దొడగుంటపల్లి, అంకూరు, బలిజపల్లికి చెందిన కొంత పొలాలు కలిపి సుమారు 1600 మంది రైతులు 2,800 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఇందులో 1,850 ఎకరాల్లో వరి, వేరుశనగ 400 నుంచి 500 ఎకరాల్లో, 250 ఎకరాల్లో ఇతర ఆరుతడి పంటలు సాగు చేస్తున్నారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో ఫార్మర్‌ రిజిస్ట్రీలో అధికారులు చేసిన తప్పుకు రైతులు ఎరువులు తెచ్చుకోవాలంటే సుమారు 45 కి.మీ దూరంలో ఉన్న అమరచింత మండలానికి వెళ్లాల్సిన దుస్థితి వస్తోంది. దీంతో రైతులకు రవాణా భారం తడిసి మోపెడవుతోంది. పెద్ద రైతులు ట్రాక్టర్లు, ఆటోలు కిరాయికి తీసుకొని వెళ్తున్నా.. రెండు, మూడు బస్తాల ఎరువులు కావాల్సిన సన్న, చిన్నకారు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వనపర్తి రూరల్‌: విద్యుత్‌ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. కనీసం ఆరు గంటలు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదంటూ గురువారం మండలంలోని కడుకుంట్ల శివారు సబ్‌స్టేషన్‌ ఎదుట కడుకుంట్ల సర్పంచ్‌ తిరుపతయ్య ఆధ్వర్యంలో కడుకుంట్ల, పెద్దగూడెం గ్రామ రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. విద్యుత్‌ కోతలతో బోర్లుమోటార్లు తరచూ కాలిపోతున్నాయని, పంటలకు సాగునీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలతో పాటు నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని కోరారు. రైతుల ఆందోళనతో రహదారికి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌, విద్యుత్‌శాఖ డీఈ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగి విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీఈ రైతులకు వివరించారు. వ్యవసాయానికి 12 గంటల విద్యుత్‌ సరఫరా చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మాణిక్యం, నాయకులు రఘువర్ధన్‌రెడ్డి, ధర్మానాయక్‌, మాధవరెడ్డి, డేగా మహేశ్వర్‌రెడ్డి, చిట్యాల రాము, లక్ష్మీకాంత్‌, బాలకృష్ణ, కొండయ్య, కృష్ణానాయక్‌, మనీష్‌, గ్రామ అధ్యక్షుడు వెంకటేష్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

రైతుల ఆందోళన

పామిరెడ్డిపల్లి రైతులు గురువారం ప్రధాన రాహదారిపై రాస్తారోకో చేశారు. ట్రాఫిక్‌ అంతరాయం కలుగడంతో పెద్దమందడి ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి రైతుల సమస్య గురించి ఫోన్‌లో తహసీల్దార్‌, ఏఓ చర్చించారు. సమస్యను పరిష్కరిస్తామని సర్ధిచెప్పడంతో ఆందోళన విరమించారు. దీనిపై వ్యవసాయాధికారులు మాట్లాడుతూ.. ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసేటప్పుడు పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి భూముల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో జరిగిన చిన్న పొరపాటు కారణంగా అమరచింత మండలంలోని పాంరెడ్డిపల్లి క్లస్టర్‌ చూపుతుందన్నారు. ఢిల్లీలోని వ్యవసాయ ప్రధాన కార్యాలయం నుంచే సమస్యను పరిష్కరించే వీలుంటుందని, సమయం పడుతుందని తెలిపారు.

జిల్లాలో రెండు పామిరెడ్డిపల్లి గ్రామాలు

ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ యాప్‌లో బుకింగ్‌కు ఇబ్బందులు

రైతులకు తప్పని అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement