మా చిన్నతనంలో మదనాపురం ఒక పెద్ద వ్యాపారకేంద్రంగా ఉండేది. ముంబై, మద్రాస్, గుజరాత్ వ్యాపారులు ఇక్కడ రైస్‌మిల్లులు ఏర్పాటు చేశారు. అయితే సాయుధ పోరాటం తీవ్రమవడంతో గ్రామస్తుల సహకారం లేక వారు మిల్లులను వదిలి వెళ్లడం నేను ప్రత్యక్షంగా చూశా. కర్నూలు, మద్రాస్ వెళ్లేవాళ్లు మదనాపురం రైలు దిగి ఇక్కడి టంకశాలలో కరెన్సీ మార్చుకునేవారు. నాడు కరెన్సీ మార్పిడి సాగిన ఆ టంకశాల భవనమే నేడు పోలీస్స్టేషనన్గా మారింది. సెప్టెంబర్ 17 అనగానే నాటి సాయుధ పోరాట జ్ఞాపకాలు, ఈ సరిహద్దు టంకశాల కథలే మా కళ్లముందు మెదలుతాయి.
– టీకే కురుమన్న,
విశ్రాంత ఉపాధ్యాయుడు, మదనాపురం
●


