సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలి

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

పాన్‌గల్‌: రైతులు సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలని కేవీకే కృషి విజ్ఞాన శాస్త్రవేత్త డా. భవాని సూచించారు. గురువారం మండలంలోని దావాజిపల్లిలో యూత్‌ ఫర్‌ యాక్షన్‌ ఆధ్వర్యంలో యాజమాన్య పద్ధతులు, వరి సాగు, ఎల్‌నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని, నానో ఎరువుల వినియోగం, పప్పుధాన్యాలు, ఆయిల్‌పాం, కూరగాయల సాగు గురించి వివరించారు. చీడపీడల నివారణకు అధికారుల సూచనల మేరకు మందులు వాడాలన్నారు. కార్యక్రమంలో ఏడీఏ తిప్పేస్వామి, సర్పంచ్‌ సూగురమ్మ, ఏఈఓ, రైతులు పాల్గొన్నారు.

13న జిల్లా కబడ్డీ జట్టు ఎంపికలు

వనపర్తి రూరల్‌: పెబ్బేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 13న ఉదయం 8 గంటలకు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ఽఆధ్వర్యంలో జూనియర్‌ బాలురు, సబ్‌ జూనియర్స్‌ బాలికల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి కురుమయ్య గురవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలురు 05.11.2006 తర్వాత జన్మించి 75 కిలోల బరువు.. బాలికలు 10.12.2010 తర్వాత జన్మించి 55 కిలోల బరువున్న వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు పదోతరగతి ఒరిజినల్‌ మార్కుల ధ్రువపత్రం, జనన ధ్రువపత్రం, బోనాఫైడ్‌ తీసుకురావాలని సూచించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 26 నుంచి 29 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 70130 50502, 85001 65900 సంప్రదించాలని సూచించారు.

ఆయిల్‌పాం తోటలపరిశీలన

కొత్తకోట రూరల్‌: మండల కేంద్రానికి చెందిన రైతు వేముల హరీశ్‌రెడ్డి ఆయిల్‌పాం తోటలను గురువారం మోజర్ల ఉద్యాన కళాశాల అసోసియేట్‌ డీన్‌ డా. వీణాజ్యోషి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. శంకరస్వామి పరిశీలించారు. ఎల్‌నినో నేపథ్యంలో తోటల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీరు, పోషకాహార నిర్వహణ, మొక్కల సంరక్షణకు పలు సూచనలు చేశారు. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాసీ్త్రయ పద్ధతులు పాటించాలని, పంటను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని తెలిపారు. అధిక దిగుబడులు సాధించేందుకు ఉద్యాన అధికారుల సలహాలు పాటించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement