మహిళా సంఘాల్లో చదువు రాని సభ్యులకు.. అదే సంఘాల్లో చదువుకున్న మహిళలతో బోధన అందించేలా ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ప్రతి మార్చి, ఆగస్టు నెలల్లో రెండుసార్లు పరీక్షలు నిర్వహిస్తున్నాం. మహిళలను 100 శాతం అక్షరాస్యులుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్,
వయోజన విద్య, ఉమ్మడి జిల్లా అధికారి
తరగతులు బోధిస్తున్నారు
మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మాకు అక్షరాస్యత పెంచేందుకు గ్రామంలోని విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు తరగతులు బోధిస్తున్నారు. దీంతో అవసరమైన చోట సంతకాలు చేయడం, మహిళా సంఘం పుస్తకాల్లో లెక్కలు చూసుకోవడం నేర్చుకుంటున్నాం. ఈ తరగతులు మాకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
– పద్మ, మన్యంకొండ, మహబూబ్‌నగర్
మాకు ఎంతో మేలు
మహిళా సంఘాల ఆధ్వర్యంలో సాయంత్రం వేళల్లో చదువులు బోధిస్తున్నారు. చదవడం, రాయడం నేర్చుకోవడంతో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. బ్యాంకు, మహిళా సంఘాలకు సంబంధించిన పనులను సొంతంగా చేసుకునే అవకాశం కలుగుతోంది. ఈ కార్యక్రమం వల్ల మాకు ఎంతో ప్రయోజనం ఉంది.
– సుమంగళ, మాచన్‌పల్లి, మహబూబ్‌నగర్
●


