కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌ ఎదుట బీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన

Sep 8 2026 1:11 AM | Updated on Sep 8 2026 1:11 AM

వనపర్తి: శాసనసభ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే అమానుషంగా అరెస్టు చేశారని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌ ఆరోపించారు. సోమవారం కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసెంబ్లీలోకి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్న పోలీసుల తీరును ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధుల పట్ల వారు వ్యవహరించిన తీరు సరికాదని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, సంక్షేమాన్ని గాలికొదిలేశారంటూ బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌కు అర్జీ దాఖలు చేశారు. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని.. లేనిపక్షంలో ప్రజా ఉద్యమంతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శ్రీశైలం జలాశయంలో సమృద్ధిగా నీరున్నా ఎల్‌నినో పేరిట పంటలకు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ పలుస రమేష్‌గౌడ్‌, నాయకులు నందిమళ్ల అశోక్‌, గంధం పరంజ్యోతి, కౌన్సిలర్‌ శ్రీకర్‌గౌడ్‌, మహిళా నాయకులు కవిత, షమీంబేగం, ప్రేమనాథ్‌రెడ్డి, బండారు కృష్ణ, నాగన్నయాదవ్‌, రఘువర్ధన్‌రెడ్డి, నర్సింహ, మహేశ్వర్‌రెడ్డి, గులాం ఖాదర్‌ఖాన్‌, జోహెబ్‌, రాము పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement