రూ.6 కోట్ల విలువైన ధాన్యం మాయం | - | Sakshi
Sakshi News home page

రూ.6 కోట్ల విలువైన ధాన్యం మాయం

Sep 8 2026 1:11 AM | Updated on Sep 8 2026 1:11 AM

ఖిల్లాఘనపురం: మండలంలోని సోళీపురం గ్రామవాసి శేఖర్‌రెడ్డికి చెందిన మూడు రైస్‌మిల్లులో సోమవారం ఉదయం నుంచి విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, జిల్లా పౌరసరఫరాల శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. గోపాల్‌పేట మండలం చెన్నారంలోని నవ్య రైస్‌మిల్లుతో పాటు సోళీపురంలోని సింధు రైస్‌మిల్లు, సింధు ఆగ్రో ఇండస్ట్రీస్‌ (బాయిల్డ్‌ మిల్లు)లో విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ గణేష్‌, కమర్షియల్‌ టాక్స్‌ అధికారి సురేష్‌, తహసీల్దార్‌ రాజశేఖర్‌, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్‌ దుబ్బాక పరమేష్‌, ఆయా శాఖల సిబ్బందితో కలిసి రాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. సింధు ఆగ్రో ఇండస్ట్రీస్‌ మిల్లులో సుమారు రూ.6 కోట్ల విలువైన 51 వేల వరి ధాన్యం బస్తాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు వారు తెలిపారు. తదుపరి చర్యలు మంగళవారం చేపట్టనున్నట్లు డీటీ పరమేష్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement