‘సర్‌’ సందేహాలు నివృత్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ సందేహాలు నివృత్తి చేయాలి

Sep 4 2026 12:42 AM | Updated on Sep 4 2026 12:42 AM

వనపర్తిటౌన్‌: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటర్లకు ఎలాంటి సందేహాలున్నా సంబంధిత అధికారులు, బీఎల్వోలు సంప్రదించి నివృత్తి చేయాలని, పెండింగ్‌లో ఉన్న హియరింగ్‌లను వేగవంతంగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ హియరింగ్‌ ప్రక్రియను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హియరింగ్‌కు హాజరైన ఓటర్లు, దరఖాస్తుదారుల పత్రాలను తనిఖీ చేసి నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రధాన లక్ష్యమన్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు సమర్పించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అర్హుల పేర్లు జాబితా నుంచి తొలగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి కేసును వాస్తవ ప్రాతిపదికన పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట పుర కమిషనర్‌ నిరంజన్‌, రెవెన్యూ అధికారులు, బీఎల్వోలు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement