వనపర్తి డిపోకు 137 శాతం ఓఆర్‌ | - | Sakshi
Sakshi News home page

వనపర్తి డిపోకు 137 శాతం ఓఆర్‌

Sep 4 2026 12:42 AM | Updated on Sep 4 2026 12:42 AM

వనపర్తిటౌన్‌: రాఖీపండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమర్థవంతంగా సర్వీసులు నిర్వహించడంతో పాటు అదనపు ట్రిప్పులు నడిపి ఏకంగా 137 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) సాధించి అత్యధిక ఆదాయాన్ని నమోదు చేశారని డిపో మేనేజర్‌ దేవేందర్‌గౌడ్‌ తెలిపారు. గురువారం జిల్లాకేంద్రంలోని డిపో ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక గేట్‌ మీటింగ్‌లో రాఖీ పండుగ వేళ మెరుగైన సేవలందించిన కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్‌ సిబ్బంది, సూపర్‌వైజర్లను అభినందించి మిఠాయిలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఉద్యోగులు చూపిన సమష్టి కృషినే ఘనతకు కారణమన్నారు. ఆగస్టు మొత్తంలోనూ డిపో 100 శాతం ఓఆర్‌ సాధించి సంస్థ పురోగతిలో ముందువరసలో నిలిచిందని తెలిపారు. ఉద్యోగులందరి ఐక్యత, బాధ్యతాయుతమైన పనితీరుతోనే సాధ్యమైందని.. భవిష్యత్‌లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ డిపోకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు జయకృష్ణ, కృష్ణ, ఎస్‌డీఐ కృష్ణ, కంట్రోలర్లు, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement