సంకల్పసభ విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సంకల్పసభ విజయవంతం చేయాలి

Sep 4 2026 12:42 AM | Updated on Sep 4 2026 12:42 AM

కొత్తకోట: ఈ నెల 6న నిర్వహించనున్న చలో హైదరాబాద్‌ ఉద్యోగుల సంకల్పసభను విజయవంతం చేయాలని తపస్‌ రాష్ట్ర కార్యదర్శి వేముల అమరేందర్‌రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఎమ్మార్సీలో సభకు సంబంధించిన కరపత్రాలను ఉపాధ్యాయులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కొనసాగిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులను పట్టించుకోని ఏ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని, ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి కృష్ణయ్య, తపస్‌ మండల అధ్యక్షుడు రాఘవేంద్రాచారి, ప్రధానకార్యదర్శి అరవింద్‌రెడ్డి, గౌరవ అధ్యక్షుడు బాలకొండయ్య, జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మయ్య, ఈశ్వరయ్య, కురుమూర్తి, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement