న్యూస్‌రీల్
సీఎం మద్దూరు
పర్యటనపై ఆసక్తి..
పాలమూరులో జోరుగా పాలి‘ట్రిక్స్’
కలవని చేతులతో..
చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై ఉత్కంఠ..
వనపర్తి
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
● సీనియర్ నేత చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠ
● వెయ్యి రోజుల పాలనపై పార్టీల
పోటాపోటీ కార్యక్రమాలు
● చేసిన అభివృద్ధి, సంక్షేమంపై
కాంగ్రెస్ నేతల ప్రెస్‌మీట్లు
● పలు ప్రాంతాల్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
● దగా పాలన అంటూ రోడ్డెక్కిన
బీఆర్‌ఎస్ నేతలు
● ఆసక్తి రేపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి మద్దూరు పర్యటన
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
మంత్రి ఇలాకాలో
కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ
చిన్నంబావి: మంత్రి జూపల్లి స్వగ్రామమైన పెద్దదగడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని, ఆయన పతనం సొంతగడ్డ నుంచే ప్రారంభమైందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం పెద్దదగడ పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరగా.. వారికి బీరం పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం బీరం మాట్లాడుతూ.. మంత్రి జూపల్లి తన సొంత గ్రామం పెద్దదగడ అభివృద్ధికి వందరోజుల్లో అద్భుతమైన ప్రణాళిక రూపొందిస్తామని చెప్పి వెయ్యి రోజులు గడిచినా గ్రామాభివృద్ధికి చేసిందేమి లేదని విమర్శించారు. చేరిన వారిలో కంచి జ్ఞానేశ్వరి, కరుణాకర్, మాజీ ఎంపీటీసీ గోద వెంకటేశ్వర్లు, రమేష్, పురేందర్‌గౌడ్, వెంకటేష్‌గౌడ్, మునిశ్వర్లు, శివశంకర్, రాముడు ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సోమేశ్వరమ్మ, మాజీ జెడ్పీటీసీ వెంకటరమణమ్మ, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శరత్ రెడ్డి, ఈదన్నయాదవ్, రంజిత్‌కుమార్, రామకృష్ణ, నిరంజన్ రెడ్డి, పాండురంగయ్య, మహిచంద్ర, రమేష్, శేఖర్‌గౌడ్, నరసింహ పాల్గొన్నారు.
3 యూనిట్లలో
విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎగువ, దిగువ జూరాల జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. బుధవారం మూడు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువ జూరాలలో రెండు యూనిట్ల ద్వారా 78 మెగావాట్ల సామర్థ్యంతో, ఇప్పటివరకు 98.518 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. దిగువ జూరాలలో ఒక యూనిట్ ద్వారా 40 మెగావాట్ల సామర్థ్యంతో, 84.304 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నమోదైందన్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో ఇప్పటివరకు మొత్తం 182.822 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగినట్లు ఎస్‌ఈ తెలిపారు.
దరఖాస్తుల ఆహ్వానం
గద్వాల: జిల్లాలో వెన్నెముక సమస్య, కండరాల క్షీణిత, సికిల్ సెల్ అనీమియా, హిమోఫీలియాతో మంచానికుకే పరిమితమైన వారికి అత్యవసర వైద్యసహాయం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జౌషధాల కొనుగోలు, ఎ స్కార్ట్ అటెండర్ సహాయం కోసం దరఖాస్తులను కలెక్టరెట్‌లోని మహిళా శిశుసంక్షేమం, ది వ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ నుంచి పొందవచ్చని పేర్కొన్నారు. సదరం సర్టిఫికెట్, కుల, ఆదాయ పత్రాలు, ఆధార్‌తో దరఖాస్తు సమర్పించాలని సూచించారు. మెడికల్ బోర్డు నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, సహాయం అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్‌లో అంతర్గత పరిణామాలు, మరోవైపు వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ఊపందుకున్న పోటాపోటీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ సంబరాలకు సిద్ధమవుతుంటే.. దగా పాలన అంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఆందోళన బాట పట్టింది. వారం రోజుల ఆందోళనలో భాగంగా తొలి రోజు బుధవారం ఆ పార్టీ నేతలు రోడ్డెక్కారు. ఈ రాజకీయ వేడి రాజుకున్న క్రమంలో ఈ నెల నాలుగో తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నారాయణపేట జిల్లా మద్దూరు మండల పర్యటన ఖరారు కావడం పాలమూరు వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.
బీఆర్‌ఎస్ దూకుడు మంత్రంతో..
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. ప్రజా పాలన కాదు.. ఇది దగా పాలన అంటూ వారం రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు తొలిరోజు బుధవారం ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాకేంద్రాలతో పాటు పలు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇచ్చిన గ్యారెంటీలు, రైతులకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నేతలు భగ్గుమన్నారు. వారం పాటు ఆందోళన కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా దూకుడుగా వ్యవహరించాలని మండలాల వారీగా నాయకులు, అనుచరులతో భేటీ అయిన సందర్భంలో ముఖ్య నేతలు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
వనపర్తి: సాగునీటి ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సవాల్ స్వీకరించాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో చేపట్టింది కేవలం రెండు ప్రాజెక్టులు మాత్రమేనని, అందులో కాళేశ్వరం పూర్తి చేయగా.. పాలమూరు–రంగారెడ్డిని ఎండగట్టారని ఎద్దేవాచేశారు. బుధవారం డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, సాగునీటి కాల్వలకు గండ్లు కొట్టి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తొమ్మిదిన్నర ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ మార్పులు, వెలిగొండ టన్నెల్ పనులు, నల్లమల్ల ప్రాజెక్టుల విషయం తెలియదా అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చితే.. కాంగ్రెస్ వాటికి వడ్డీలు కడుతూ.. సంక్షేమ, అభివృద్ధి పనులను కొనసాగిస్తుందన్నారు. వెయ్యి రోజుల్లో వనపర్తి నియోజకవర్గంలో సుమారు రూ. రూ.2,389 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లుగా అందుకు సంబంధించిన వివరాలతో ముద్రించిన పత్రాలను ఎమ్మెల్యే విడుదల చేశారు. తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో మాజీ మంత్రి పనులపై కమీషన్లు తీసుకోలేదని గుడి ఎక్కేందుకు సిద్ధమా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలం
సంక్షేమం, అభివృద్ధి పనులపై చర్చకు తాము ఎప్పుడూ స్వాగతిస్తామని, కానీ విపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్‌ఎస్ అడ్డగోలు ఆరోపణలు చేస్తుందని డీసీసీ ప్రెసిడెంట్ శివసేనారెడ్డి మండిపడ్డారు. ప్రజల్లోకి విష సంస్కృతిని తీసుకువెళ్తుందని, వారే ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. అడ్డగోలు నిర్ణయాలతో చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు కడుతూ.. ఎన్నో సదాలోచనలతో వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనుకున్న పనులు సకాలంలో చేపట్టలేకపోతుందన్నారు. మిగులు బడ్జెట్ చేతికి వచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌ది కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షడు సాయిచరణ్‌రెడ్డి, లక్కాకుల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
గురువారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, బీఆర్‌ఎస్ నిరసనల నడుమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో పర్యటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల నాలుగో తేదీన నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో జరిగే పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. గిరిజన గురుకుల భవనాలు, డిగ్రీ కళాశాల, ఇతర మౌలిక వసతుల పనులను పర్యవేక్షించిన తర్వాత నిర్వహించే బహిరంగసభ ద్వారా ప్రతిపక్షాల ఆరోపణలకు ఎలాంటి సమాధానమిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాల్లోని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నేతలు పలు ప్రాంతాల్లో ప్రెస్‌మీట్లు పెట్టి తమ ప్రభుత్వ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మహబూబ్‌నగర్‌లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. వనపర్తి జిల్లాలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డిలు విలేకరుల సమావేశం నిర్వహించి అభివృద్ధిని వివరించడంతో పాటు ఖిల్లాఘనపురం మండలంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. అయితే మిగతా జిల్లాల్లో వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలకు దూరంగా ఉన్నాయి. ఇందుకు డీసీసీ నేతలు, పార్టీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలే కారణమనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డికి
ఎమ్మెల్యే మేఘారెడ్డి సవాల్
–9లో u
వనపర్తికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది. 2023 ఎన్నికల సమయంలో మేఘారెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌కు రావడం.. తొలుత చిన్నారెడ్డికి వనపర్తి టికెట్ కేటాయించిన కాంగ్రెస్, ఆ తర్వాత మేఘారెడ్డికి ఇవ్వడం ఇరువురి మధ్య విభేదాలకు దారితీసింది. అయితే చిన్నారెడ్డి గోపాల్‌పేట వేదిక చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. సీరియస్‌గా పరిగణించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆయనపై భగ్గుమన్నారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని గాంధీభవన్, టీపీసీసీతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సైతం ఆయనపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి సిఫార్సు చేయగా.. పెండింగ్‌లోనే ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో మంత్రి సురేఖ ఎపిసోడ్ నడుస్తుండగా.. ఆ తర్వాత చిన్నారెడ్డిని ఢిల్లీకి పిలవనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయనపై చర్యలకు సంబంధించి రాజకీయ వర్గాల్లో విభిన్న వాదనలు నడుస్తున్నాయి.


