ఉల్లి ధరలకు రెక్కలు | - | Sakshi
Sakshi News home page

ఉల్లి ధరలకు రెక్కలు

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో బుధవారం జరిగిన వేలంలో ఉల్లి ధరలకు రెక్కలు వచ్చాయి. సీజన్‌లో రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు దాటని ధరలు సీజన్‌ ముగిసిన తర్వాత పెరగడం ప్రారంభమైంది. మే వరకు నిలకడగా ఉన్నా.. జూన్‌ నుంచి కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చాయి. జూలైలో రూ.3 వేల పైచిలుకు ధరలు నమోదు కాగా.. తాజాగా మరింత పెరిగి.. రూ.5,200 వరకు ఎగబాకింది. బుధవారం ఉల్లి వేలం వేయగా క్వింటాల్‌ ఉల్లి రూ.5,200, కనిష్టంగా రూ.3,500 వరకు పలికింది. దాదాపు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. 50 కిలోల బస్తా ధర గరిష్టంగా రూ.2,600, కనిష్టంగా రూ.1,800 వరకు అమ్మకాలు సాగాయి. చిల్లరగా రూ.40 నుంచి రూ.60 వరకు అమ్మారు.

క్వింటాల్‌ గరిష్టంగా రూ.5,200..

కనిష్టంగా రూ.3,500

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement