కొత్తకోట రూరల్: నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అప్పరాలలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొని ప్రారంభించి లబ్ధిదారులకు కొత్త దుస్తులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మూడేళ్లలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఎలాంటి అపోహలను నమ్మవద్దని కోరారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్ మాజీ చైర్మన్ పి.ప్రశాంత్, సర్పంచ్ మాసన్న, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు రావుల కరుణాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, సీడీసీ చైర్మన్ చంద్రమోహన్‌రెడ్డి, బీచుపల్లి యాదవ్, శివరాములు తదితరులు పాల్గొన్నారు.


