సమస్యల పరిష్కారానికి ఆందోళన | - | Sakshi
Sakshi News home page

సమస్యల పరిష్కారానికి ఆందోళన

Aug 28 2026 12:39 AM | Updated on Aug 28 2026 12:39 AM

వనపర్తిటౌన్‌: సీపీఎస్‌ రద్దు చేసి పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేయాలని టీజీఈజేఏసీ జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం కలెక్టరేట్‌ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న 6 కరువు భత్యాలను ప్రకటించాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలని కోరారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంలోని లోపాలను సరిచేసి పూర్తిస్థాయిలో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అనంతరం సంఘం నాయకుడు జి.వరప్రసాద్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలు అమలు చేయాలని, ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఉద్యోగుల దీక్ష శిభిరాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement