కాంగిరేసులో మళ్లీ రచ్చ! | - | Sakshi
Sakshi News home page

కాంగిరేసులో మళ్లీ రచ్చ!

Aug 18 2026 1:03 AM | Updated on Aug 18 2026 1:03 AM

వనపర్తి: 2023 ఎన్నికల ముందు నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఆదివారం గోపాల్‌పేటలో కాంగ్రెస్‌ పార్టీ మండల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా చిన్నారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ పార్టీల నాయకులతో పాటు మీడియాలో ఇదే చర్చ సాగుతోంది. ఇదివరకే చిన్నారెడ్డి పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. పార్టీ అధిష్టానం కలుగజేసుకుని కొంత శాంతింపజేసింది. మరోసారి ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుల విషయంపై వ్యాఖ్యానించడం మళ్లీ వివాదానికి దారి తీసింది.

ఒకే పార్టీలో ఉంటూ..

ఇద్దరు నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించుకోవడాన్ని అధిష్టానం ఎలా డీల్‌ చేస్తుందనే అంశంపై పార్టీ కేడర్‌లో చర్చ కొనసాగుతోంది. రానున్న ఎన్నికల నాటికి తమ ఆధిపత్యం ఉండాలనే ప్రయత్నాలు ఇప్పటి నుంచే సాగుతున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా పార్టీలోనే ఉంటూ, బలంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ.. తన వర్గానికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి బహిరంగంగానే చెప్పడం గమనార్హం.

పార్టీ ప్రతిష్టను భంగపరిచే విధంగా వ్యాఖ్యలు చేసి న చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ిఎమ్మెల్యే మేఘారెడ్డి సోమవారం కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌, ఎంపీ డా.మల్లు రవిని కల్వకుర్తిలో కలిసి ఫిర్యాదు చేశారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అ ధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లను కలిసి ఫిర్యాదులు చేస్తామన్నారు. పార్టీ అధిష్టానం కోట్లాది రూపాయలు తీసుకుని తనకు బీఫాం ఇచ్చిందని పార్టీని అవమానించడంతో పాటు నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వెంట అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఉన్నారు.

క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌కు ఫిర్యాదు

మాటల యుద్ధం..

‘‘వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసేందుకు తాను చేసే ప్రయత్నాలకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడు.. తనకు సంబంధించిన కంట్రాక్టర్‌కు ఐటీ టవర్‌ పనులు వచ్చాయని టెండర్లు రద్దు చేయించారు.. గోపాల్‌పేటకు నాలుగు వరుసల రోడ్డు, బ్యూటిఫికేషన్‌ కోసం నిధులు కోరితే.. మంత్రులు తనను నిరాశ పరిచారు.’’ అంటూ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా డబ్బులు తీసుకుని మేఘారెడ్డికి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చారంటూ.. కాంగ్రెస్‌ అధిష్టానంలోని కొందరిపై తరచుగా చేస్తున్న వ్యాఖ్యలపై సోమవారం ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ.. పార్టీని అప్రతిష్టపాలుజేస్తున్నారని.. ఇక ఫిర్యాదు చేయక తప్పడం లేదంటూ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సైతం ఈ వివాదంలోకి తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. ‘‘పార్టీలో సీనియర్‌గా ఉంటూ.. కెబినెట్‌ హోదాలో ఉన్నారనే గౌరవంతో ఇన్నాళ్లు ఊరుకున్నా.. పదే పదే అనుచిత వ్యా ఖ్యలు చేస్తూ.. పార్టీని ప్రజల్లో చులకన చేస్తుంటే సంహించేది లేదు. నాలుగేళ్ల క్రితమే గోపాల్‌పేటలో కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటుచేశాం. తన వర్గం కోసం మరో కార్యా లయం ప్రారంభించడం.. సందర్భం లేకుండా సొంత పార్టీలోని ప్రజాప్రతినిధులను దుషిస్తూ.. పార్టీ క్రమశక్షణ తప్పతున్నారు.’’ అని ఎమ్మెల్యే మేఘారెడ్డి వ్యాఖ్యానించారు. చిన్నారెడ్డిపై టీపీసీసీ, సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తామని ప్రకటించారు.

వివాదానికి దారితీసిన చిన్నారెడ్డి వ్యాఖ్యలు

ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

పార్టీ అధిష్టానానికి పరస్పర ఫిర్యాదులకు సిద్ధం

ఇద్దరు నేతల వివాదాన్ని లాభంగా మార్చుకుంటున్న బీఆర్‌ఎస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement