కొత్తకోట రూరల్: రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ఆదివారం పెద్దమందడి మండలం మద్దిగట్లలో జరిగిన పలువురి ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు ఉండాలని కోరుకుంటారని.. ఆ కలను సాకారం చేసుకోవడం ఎంతో అదృష్టమన్నారు. అనంతరం మండల నాయకులతో సమావేశమై స్థానికంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిచరణ్‌రెడ్డి, మోజర్ల సర్పంచ్ శేఖర్, పెద్దమందడి మండల అధ్యక్షుడు వెంకటస్వామి, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్, సత్యారెడ్డి, పుట్టమోని నారాయణ, రామచంద్రయ్యగౌడ్, వెంకటేశ్వర్‌రెడ్డి, బాబురెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


