మండలాలకు చేరిన ప్రజావాణి | - | Sakshi
Sakshi News home page

మండలాలకు చేరిన ప్రజావాణి

Aug 17 2026 7:35 AM | Updated on Aug 17 2026 7:35 AM

అమరచింత/ఆత్మకూర్‌: కలెక్టరేట్‌, సబ్‌ కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహిస్తుండగా.. ఫిర్యాదుదారులు ఆయా కార్యాలయాల్లో సోమవారం నిర్వహించే కార్యక్రమానికి హాజరై వినతులు అందజేస్తున్నారు. కొన్ని మండలాల వారికి దూరభారం కావడం, దివ్యాంగులు, వృద్ధులు, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నాళ్ల పాటు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రజావాణి జరి గినా అన్నిశాఖల అధికారులు రాకపోవడం, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తిరిగి జిల్లాకేంద్రానికి వెళ్తున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట నిర్వ హించి ప్రతి దరఖాస్తును పోర్టర్‌లో నమోదు చేసి పరిశీలన, పరిష్కారంపై జవాబుదారీతనంతో వ్యవహరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ కార్య క్రమం గత వారమే మొదలు కావాల్సి ఉండగా.. సె లవు రావడంతో నేటి నుంచి ప్రారంభించనున్నారు.

ఎంపీడీఓలే నోడల్‌ అధికారులు..

మండలస్థాయిలో జరిగే ప్రజావాణికి నోడల్‌ అధికారిగా ఎంపీడీఓ వ్యవహరిస్తారు. వారే మండలస్థాయిలోని అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని కార్యక్రమం నిర్వహించాలి. తహసీల్దార్‌, మండల పంచాయతీ అధికారి, పశుసంవర్దకశాఖ, ఉద్యాన, విద్య, మత్స్య, గృహనిర్మాణ, అటవీ, భగీరథ, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ అధికారులతో పాటు డిప్యూటీ తహసీల్దార్‌, ఐసీడీఎస్‌ అధికారులు పాల్గోనాల్సి ఉంటుంది.

ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహణ

హెల్ప్‌డెస్క్‌లు, వసతుల కల్పన

జిల్లాకేంద్రానికి వెళ్లే

ఇబ్బందులు తప్పినట్టే

దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసేలా సిబ్బందికి శిక్షణ

ప్రతి దరఖాస్తు పోర్టల్‌లో..

ప్రజావాణికి వచ్చే ప్రతి వినతిని పోర్టల్‌లో నమోదు చేయాలి. అంతేగాక ఫిర్యాదుదారులకు గుర్తింపు సంఖ్యలో రసీదు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం మండలస్థాయి అధికారులు, శాఖల ఆపరేటర్లకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్ట్‌ కేటాయించారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కూడా పూర్తయింది.

వసతుల కల్పన..

వినతులు అందజేసేందుకు వచ్చే ప్రజలు ఇబ్బందిపడకుండా కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించడమే కాాకుండా వైద్యసేవల కోసం ఆరోగ్య సిబ్బందిని కేటాయించాలి. అలాగే దివ్యాంగులకు వీల్‌చైర్లు, ప్రజావాణికి దరఖాస్తులతో వస్తున్న వారికి అవగాహన కల్పించేందుకు సిబ్బందిని కేటాయించాలి. వృద్ధులు, గర్భిణులు, బాలింతల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement